Shubman Gill: ప్రపంచకప్ జట్టులోని సంజు శాంసన్‌ ఫోటోని తొలగించిన టీమిండియా కెప్టెన్.. 

Shubman Gill: ప్రపంచకప్ జట్టులోని సంజు శాంసన్‌ ఫోటోని తొలగించిన టీమిండియా కెప్టెన్.. 

Shubman Gill: టీ20 వరల్డ్ క‌ప్ 2026 విశ్వవిజేత‌గా టీమిండియా నిలిచింది. మార్చి8వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై 96 ప‌రుగుల తేడాతో గెలిచి మూడోసారి పొట్టి కప్ ని ముద్దాడింది. ఈ ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంస‌న్ కీల‌క పాత్ర పోషించాడు. సూపర్–8లో వెస్టిండీస్ పై 97 ప‌రుగులు, సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 89 రన్స్ తో పాటు ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై 89 పరుగులు చేశాడు. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా సంజు శాంసన్ కైవసం చేసుకున్నాడు. 

ఇండియన్ టీమ్ టీ20 వరల్డ్ కప్‌ను గెలవడంతో టెస్టు, వ‌న్డే కెప్టెన్ అయిన శుభ్‌మ‌న్ గిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా భారత జట్టుకి శుభాకాంక్షలు చెప్పాడు. టీమిండియా ప్రపంచ కప్ ట్రోఫీని అందుకునే సమయలో దిగిన ఫోటోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశాడు. కానీ ఇప్పుడు ఈ ఫోటో పైనే తీవ్ర వివాదం కొనసాగుతుంది. గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో సంజూ శాంస‌న్ క‌నిపించ‌డం లేద‌ని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాల‌నే ఫోటోలో శాంస‌న్‌ను  గిల్ తీసివేశాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. 

టీమ్ లో గిల్ స్థానంలో సంజు శాంసన్ కి చోటు ద‌క్కడం వలన కోపంతో ఉన్న టీమిండియా వన్డే, టెస్టుల కెప్టెన్ గిల్ ఇలా పగ తీర్చుకున్నాడుని తెలుస్తుంది. ఇక అదే రోజు సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ చేసిన ఫోటోలో సంజూ శాంస‌న్ క‌నిపించ‌డాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే ఫోటోను గిల్ ఎడిట్ చేసి పోస్ట్ చేశాడా? అని క్వశ్చన్ చేస్తున్నారు. వాస్తవానికి శుభ్‌మన్ గిల్.. సంజు శాంస‌న్ ను ఫోటో నుంచి తొలగించే ఛాన్స్ లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ 2026 వేడుక‌ల రోజున తీసిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. య‌శ‌స్వి జైస్వాల్ కూడా టీమిండియాకు అభినంద‌లు తెలుపుతూ చేసిన ఫోటోలోనూ సంజూ కనిపించలేదు..