శుక్రవారం మళ్లీ తగ్గిన గోల్డ్.. ఏపీ తెలంగాణలో వెండి రేటు ఎంతంటే?

శుక్రవారం మళ్లీ తగ్గిన గోల్డ్.. ఏపీ తెలంగాణలో వెండి రేటు ఎంతంటే?

వార్ పుణ్యమా అని బంగారం, వెండి రేట్లు తగ్గుతున్నాయ్ అంటూ సామాన్య మధ్యతరగతి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అడపాదడపా గోల్డ్ రేట్లు పెరిగినప్పటికీ ఎక్కువ రోజులు మాత్రం తగ్గుతూనే వచ్చాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు శుక్రవారం షాపింగ్ చేయాలనుకుంటుంటే ముందుగా తాజాగా మారిన ధరలను పరిశీలించి ముందుకెళ్లండి. 

మార్చి 13న బంగారం రేట్లు తగ్గాయి. దీంతో మార్చి 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.98 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 124గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 780గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి రేట్ల విషయానికి వస్తే  మార్చి 13, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 90వేల వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది.