పురాణాల ప్రకారం.. ప్రస్తుతం మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం.. సత్య యుగం.. త్రేతాయుగం.. ద్వాపర యుగాలతో పోలిస్తే కలియుగంలో మానవులు తెలిసో.. తెలియకో.. స్వార్థంతో అనేక పాపాలకు వడిగడతారు. అలాంటి వాటి నుంచి విముక్తి కలగాలంటే.. దేవుని పూజలు.. దానాలు.. జపాలు.. పర్వదినాల్లో ఉపవాసాలు పాటించాలని పాటించాలని పురాణాల్లో ఉంది.
హిందూ క్యాలండర్ ప్రకారం.. నెలకు రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది. అంతేకాదు ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించి.. విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజిస్తే పాపాలు పోవడమే కాకుండా సంపద.. ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఏకాదశి వ్రతం ఆచరించి, పూజలు, మంత్ర జపాలతో ఆధ్యాత్మిక శుద్ధిని, దైవ ఆశీస్సులను కోరుకుంటారు. ఈ ఏడాది పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం వల్ల సర్వ పాపాలు తొలగి, ఆధ్యాత్మిక ప్రగతి, విష్ణు అనుగ్రహం ప్రసాదిస్తాయని నమ్మకం.
పురాణాల ప్రకారం.. తెలుగు సంవత్సరంలో చివరి నెల ...పాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపవిమోచన ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2026) మార్చి 15 వ తేదీన పాపవిమోచన ఏకాదశిని జరుపుకుంటారు.
పాపవిమోచన ఏకాదశి ఉపవాసం కేవలం ఆచారం మాత్రమే కాకుండా, మనస్సు, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర సాధనమని పండితులు చెబుతున్నారు. ఆ రోజున( 2026 మార్చి 15) భక్తులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజించి, తులసి ఆకులు సమర్పించి, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, మంత్రజపం చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఇలా భక్తితో ఆరాధించిన వారికి జీవితంలోని కష్టాలు తగ్గి, పాపబాధలు తొలగుతాయని నమ్మకం. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, ధర్మం పెరుగుతాయి. ఈ రోజున చేసే జపం, తపస్సు, దానధర్మాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
2026 పాపమోచని ఏకాదశి ఎప్పుడు?
- పాపవిమోచన ఏకాదశి తిథి ప్రారంభం : మార్చి 14 న ఉదయం 8:10 గంటలకు
- పాపవిమోచన ఏకాదశి తిథి ముగింపు : మార్చి 15 న ఉదయం 9:16 గంటలకు
- అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం, పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 15న చేయాల్సి ఉంటుంది.
- ఉపవాసదీక్షను విరమించే సమయం: ద్వాదశి ఘడియల్లో ఉపవాస దీక్షను విరమించాలి. మార్చి 16 మార్చి 16న ఉదయం 06:30 నుంచి 08:54 మధ్యలో ఉపవాసాన్ని కచ్చితంగా విరమించాలి. ద్వాదశి తిథి ఆరోజు ఉదయం 09:40కి ముగుస్తుంది.
పాపమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని.. తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి , అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా, వ్యక్తికి భూత, ప్రేత ప్రేరేపిత ప్రభావం ఉండదు. వైష్ణవాలయలను సందర్శించడం ద్వారా వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది.
ఎలా పూజ చేయాలి..
- పాపమోచని ఏకాదశి ఉపవాసం ముందు రాత్రి ( మార్చి 14) ప్రారంభించాలి.
- బ్రహ్మముహూర్తంలో ఉదయం నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి.
- ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసి, విష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి.
- దీపం, ధూపం, పువ్వులు, తులసి ఆకులు మరియు పంచామృతంతో పూజించాలి.
- “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని పఠించాలి.
- రోజంతా ఉపవాసం ఆచరించాలి.
- విష్టు సంబంధ ఆలయాలను సందర్శించాలి.
- రాత్రి సమయంలో, భజన-కీర్తనలో పాల్గొని విష్ణు సహస్రనామం పఠించాలి.
- ద్వాదశి రోజున బ్రాహ్మణుడికి లేదా పేదవారికి భోజనం పెట్టి.. దక్షిణ ... తాంబూలం ఇచ్చి ఉపవాసం విరమించాలి.
పాపమోచని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ రోజు ఉపవాసం ఆచరించడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయి. దీనితో పాటు పాపమోచని ఏకాదశి ఉపవాసం ఉండి..విష్ణుసంబంధమైన ఆలయాలను సందర్శించడం వలన వెయ్యి గోవులను దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం పొందుతారని పండితులు చెబుతున్నారు.
