ఇల్లు కట్టినా.. ఇంటి స్థలం కొన్నా కచ్చితంగా వాస్తు పండితులను సంప్రదించి సలహాలు తీసుకుంటాం. బెడ్ రూమ్.. కిచెన్ రూం.. స్టోర్ రూం.. ఇలా ప్రతిది వాస్తును అనుసరించాల్సిందే.. అయితే కొంతమంది నిద్రించేటప్పుడు ఎట్ట పడితే అలా పడుకుంటారు. కాని వాస్తు సిద్దాంతం ప్రకారమే తల పెట్టి పడుకోవాలట.. లేకపోతే అనేక సమస్యలు వసతాయంటున్నారు వాస్తు ఎక్స్పర్ట్స్.. అసలు నిద్రకు.. వాస్తుకు ఉన్న సంబంధం ఏమిటో ఈ స్టోరీలొ తెలుసుకుందాం... .!
ఏ చిన్న సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం ఆలోచించకుఉండా వాస్తు.. జ్యోతిష్యం అని ఆలోచిస్తూ పండితుల దగ్గరకు వెళతాం. ఒక్కోసారి నిత్య జీవన విధానంలో అనుసరించే విధానాల వల్ల అనుకోని సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిద్రపోయేటప్పుడు.. ఎలా పడుకుంటున్నాము.. బెడ్ రూం ఏ దిక్కులో ఉంది.. తల ఎటువైపు ఉంచి పడుకున్నాము మొదలగు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు పండితులు.
రోజూ బిజీ లైఫ్.. ట్రాఫిక్ లో అలసిపోయి.. నిద్రసమయానికి ఇంటికి రావడం.. వళ్లు తెలియకుండా నిద్రపోవడం.. ఇలా జరుగుతుంంది. కొద్దిగా తీరిక దొరికితే చాలు.. కెరీర్.. ఆరోగ్యం.. ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తుంటాం.. అయితే రోజువారీ చేసే చిన్న అలవాట్లకు కూడా వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం .. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఎక్కడ ఉంది.. ఏదిశలో ఉంది.. అరే అంశాలు మన జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. గిన్నెలు.. గరిటలు.. కిరాణా సామాన్లు భద్రపర్చుకొనే సీసాలు మొదలైనవి రోజు వాటి స్థానాలను మార్చుడమో.. లేదా కంటిన్యూగా కదపడమో చేస్తుంటా.. అలాంటి వాటి వలన పెద్దగా ప్రభావం ఉండదంటున్నారు పండితులు.. కాని మంచాలు.. బీరువాలు.. ఫ్రిజ్.. బరువైన వస్తువులు వీటిని వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచకపోతే చాలా నష్టాలు వచ్చే అవకాకాశం ఉంది.
వీటిలో ముఖ్యంగా మనం నిద్రించేమంచం ఇంట్లో ఎలా ఉంది.. తల ఎటువైపు..కాళ్లు ఎటువైపు ఉండాలో వాస్తుశాస్త్రంలో స్పష్టంగా ఉందని పండితులు చెబుతున్నారు. ఎట్టపడితే అలా పడుకుంటే ఆరోగ్య పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
దక్షిణ దిశ : వాస్తుశాస్త్రం ప్రకారం..ఈ దిశగా తలను ఉంచి పడుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. పాదాలు ఉత్తరంవైపు ఉండాలని చెబుతున్నారు. ఇలా నిద్రించడం వలన గాఢమైన నిద్ర కలుగుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా మానసికంగా ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉండి.. శరీరంలో సానుకూల శక్తి సక్రమంగా ఉంటుందంటున్నారు పండితులు..
పురాణాల ప్రకారం దక్షిణం యమ దిశ... అంటే ఆ దిశగా యమధర్మరాజు ఉంటాడు. దక్షిణం వైపు తల ఉంచి పడుకుంటే లేవడంతోనే సహజంగా ఉత్తరాన్ని చూస్తాము.. పొద్దున్నే యమధర్మరాజును చూసి భయపడితే .. ఆరోజంతా భయంగా గడపాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
తూర్పు దిశ: ఈ దిశలో కూడాతల పెట్టి పడుకోవడం మంచిదే. ఇంటి నిర్మాణ పరిస్థితులు.. గదులను బట్టి నిద్రించేటప్పుడు దక్షిణం వైపు తల పెట్టేందుకు అవకాశం లేకపోతే తూర్పు దిశగా తల ఉండాలి.
వాస్తు ప్రకారం తూర్పు దిశ దైవ దిశ. ఈ దిక్కు జ్ఞానం, శక్తి, సానుకూలతకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ దిశలో తల ఉంచి నిద్రపోతే విద్యార్థులకు చాలా మంచి జరుగుతుంది. ఏకాగ్రత పెరిగే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం ద్వారా తెలుస్తుంది.
ఉత్తర దిశ : ఈ దిశలో తల పెట్టి అసలు నిద్రించకూడదు. ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశంఉందని వాస్తు పండితులు చెబుతున్నారు. సరిగా నిద్ర పట్టకపోవడం.. తలనొప్పి.. అలసట.. ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోకుండా ఉండటం మంచిదని సూచిస్తారు వాస్తు పండితులు.
పడమర దిశ : ఈ దిశలో తలపెట్టి నిద్రపోతే చేపట్టిన పనులో ఆలస్యం జరుగుతుంది. ప్రతి పనిలో కూడా కష్ట పడాల్సి ఉంటుంది. ఈ దిక్కున కూడా తలపెట్టి నిద్రపోవడం మంచిదికాంటున్నారు పండితులు.
ఇక నిద్రపోయేటప్పుడు మంచంపై ఉన్న బెడ్షీట్ నీట్గా ఉండాలి. అస్తవ్యస్తంగా.. మరికిగా ఉంటే ప్రతికూల శక్తి విజృంభించే అవకాశం ఉంది. తల దగ్గర బరువు వస్తువుల.. అనవసర వస్తువులు ఉండకూడదు. ఇవి మానసిక అస్థిరతను కలుగజేసే అవకాశాలున్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే..మంచం ఎట్టి పరిస్థితిల్లో బీమ్ కింద ఉండకూడదు. నిద్రపోతున్నప్పుడు పాదాలు నేరుగా తలుపు వైపు ఉండకుండా చూసుకోవాలంటున్నారు వాస్తు పండితులు.
