30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి : పెట్రోలియం మంత్రిత్వ శాఖ

30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి : పెట్రోలియం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్​పీజీ ఉత్పత్తి శుక్రవారం 30 శాతం పెరిగింది.  గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని  పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని వెల్లడించింది. 

వంట గ్యాస్, రవాణా ఇంధనాల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. మనదేశ రిఫైనింగ్ సామర్థ్యం 258 మెట్రిక్​టన్నులని, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. 

ఇళ్లకు ఇచ్చే పీఎన్​జీ, వాహనాల సీఎన్​జీ సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని హామీ ఇచ్చారు.  గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసే వారిపై, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.