
టాలీవుడ్ బ్యూటీ ఇలియానా రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 19న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు నేడు (జూన్28న) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈ సందర్భంగా తన రెండోబిడ్డ ఫోటో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. అలాగే, ఆ బిడ్డకు ‘కియాను రఫే డోలన్’(Keanu Rafe Dolan) అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ‘కియాను రఫే డోలన్’ని పరిచయం చేయడంతో తమ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ లైక్స్ కొడుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఇలియానా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. హీరోయిన్ ఇలియానా పోర్చుగీసుకి చెందిన వ్యాపార వేత్త మైఖేల్ డోలన్ను పెళ్లాడింది. ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఆ బుడ్డోడి పేరు ‘కోవా ఫీనిక్స్ డోలన్’. ఇప్పటికే తన ఇంస్టాగ్రామ్లో ఇలియానా పెద్దకొడుకు ఫొటోస్ ఎన్నోసార్లు పంచుకుంది.
ప్రస్తుతం ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి తన మార్క్ వేసింది. ఇటీవల ఆమె 'దోబెర్ దో ప్కార్' అనే హిందీ చిత్రంలో కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె 'రైడ్ 2' వంటి పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది.
►ALSO READ | OTT Crime: మూడు ఓటీటీల్లోకి తెలుగు క్రైమ్ డ్రామా.. వ్యవస్థను ప్రశ్నించే కథకు మంచి రెస్పాన్స్
చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని, హిందీలో "డో ఔర్ డో ప్యార్" అనే మూవీస్ లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ప్రేక్షకులకు కనిపిస్తుంది. '