ఆ విషయం ఎవరూ చెప్పలేదు: ఇలియానా

ఆ విషయం ఎవరూ చెప్పలేదు: ఇలియానా

నటి ఇలియానా ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, రెండు నెలల ఆ చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురైనట్టు ఇలియానా తెలిపింది. దీంతో ఆమె హృదయం తల్లడిల్లిందని తన అనుభవాన్ని పంచుకుంది. మాతృత్వాన్ని ఆస్వాదించడంతో ఎంత ఆనందం ఉందో అంతే ఆందోళన కూడా ఉంటుందని వివరించింది.  

ALSO READ : యుద్ధంలో చిక్కుకున్న తాజ్​మహల్​ హీరోయిన్​ సేఫ్​

తన బిడ్డకు అనారోగ్యం అని తెలిసి తాను ఎంతో వేదన అనుభవించానని చెప్పుకొచ్చింది. అయితే, ఇందులో ఇంత బాధ ఉంటుందన్న విషయం తనకు ఎవరూ చెప్పలేదంది. తల్లులకు మాత్రమే అది అర్థమవుతుందని చెప్పింది. ఈ జర్నీలో తన ప్రియుడు తననెంతో ఓదార్చాడని.. తన చిరునవ్వుకు కారణమైనట్టు పేర్కొంది. అతడు పక్కనుండటం వల్లే తన బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు ఇలియానా తన పోస్ట్​లో చెప్పింది.