ప్రమాణ స్వీకారం... ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో గవర్నర్ సమక్షంలో, ఎంపీలు అయితే పార్లమెంట్ లో రాష్ట్రపతి సమక్షంలో, కౌన్సిలర్లు అయితే... మున్సిపల్ ఆఫీసులో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో మున్సిపల్ ఆఫీసులో నిర్వహిస్తారు. కానీ.. జైలులో ప్రమాణ స్వీకారం జరగడం ఎపుడైనా చూశారా..? దేశంలోనే మొదటిసారి కావచ్చు....కేరళలో జైలులో ప్రమాణ స్వీకారం జరిగింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లోని వాళోట్టుకోణం వార్డు బీజేపీ కౌన్సిలర్ సుగతన్, సోమవారం ( జులై 13 ) వియ్యూర్ సెంట్రల్ జైలు లోపల ప్రమాణ స్వీకారం చేశారు.
సుగతన్ సంఘ వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (కాపా) కింద జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండగా.. కేరళ హైకోర్టు ఆదేశం మేరకు జైలులోనే ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురం మేయర్ వి.వి. రాజేష్ జైలులోని లైబ్రరీ హాలులో అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ పి.కె. ఆశా నాథ్, జైలు అధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. కేరళ చరిత్రలో ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి జైలులో ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి.
#WATCH | Keralam | Thiruvananthapuram BJP councillor R. Sugathan, who is under six-month preventive detention under the Kerala Anti-Social Activities (Prevention) Act (KAAPA), retook his oath of office, inside the Viyyur Central Jail in Thrissur
— ANI (@ANI) July 14, 2026
The oath was administered by… pic.twitter.com/vMj2Ayfuf8
నాటకీయ పరిణామాల మధ్య ప్రమాణ స్వీకారం..
సుగతన్ మొదట దేవతల పేరిట చేసిన ప్రమాణాన్ని చెల్లనిదిగా ప్రకటించింది హైకోర్టు. అయితే.. తిరిగి ప్రమాణం చేసేలోపే కాపా చట్టం కింద అరెస్టయ్యాడు సుగతన్. ప్రమాణ స్వీకారం పూర్తి చేయడానికి బెయిల్ కోరుతూ అతను హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్‌ను నిరాకరించి, ప్రమాణ స్వీకారాన్ని జైలులోనే చేయించాలని ఆదేశించింది.
►ALSO READ | 70 ఏళ్ల సీనియర్ CA.. "Hello... This is Divya" అని వాట్సాప్కు మెసేజ్.. ఆగలేక రిప్లై.. రూ.21 కోట్లు ఫట్ !
అయితే, ప్రమాణంతో సుగతన్ కష్టాలు తీరిపోలేదు. కాపా కేసులో బెయిల్ మంజూరు కాకపోవడంతో అతను జైలులోనే ఉన్నాడు. మున్సిపల్ నిబంధనల ప్రకారం, అతను ఇప్పటికే రెండు కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాలేదు, వరుసగా మూడవ సమావేశానికి కూడా గైర్హాజరైతే కౌన్సిలర్‌గా అతని అనర్హతకు దారితీయవచ్చు.
