India vs Ireland T20 Series: సూర్యకుమార్ యాదవ్ (SKY) కెప్టెన్సీలో రీసెంట్‌గానే T20 వరల్డ్ కప్ 2026 కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న మెన్ ఇన్ బ్లూ, ఇప్పుడు మరో సిరీస్‌కు రెడీ అయింది. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరగబోయే రెండు మ్యాచ్‌ల T20 సిరీస్‌తో ఇండియా నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. కానీ ఈ మ్యాచ్ వీక్షించే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్.. మ్యాచ్ టైమింగ్స్ మారాయి.
ఎందుకీ టైమింగ్ చేంజ్:
నార్మల్‌గా భారత్ ఆడే T20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతాయి. కానీ ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లు మాత్రం సాయంత్రం 6 గంటలకే (IST) ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. దాంతో, మెన్స్ అండ్ ఉమెన్స్ మ్యాచ్‌లు ఒకే టైమ్‌కి వచ్చి క్లాష్ అవ్వకుండా ఉండటానికి క్రికెట్ ఐర్లాండ్ ఈ డెసిషన్ తీసుకుంది.
* 1st T20I: జూన్ 26 (శుక్రవారం)
* 2nd T20I: జూన్ 28 (ఆదివారం)
కొత్త కెప్టెన్.. ఇంగ్లాండ్ టూర్‌కు వార్మప్:
ఈ సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ టీమిండియా T20 కెప్టెన్‌గా సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. మోస్ట్లీ స్కై (SKY) బ్యాటింగ్ పొజిషన్‌లోనే అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. జూలై 1వ తేదీ నుంచి స్టార్ట్ కాబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ బిగ్ సిరీస్‌కు ఈ ఐర్లాండ్ టూర్ మనోళ్లకు ఒక పర్ఫెక్ట్ వార్మప్‌లా హెల్ప్ కానుంది.
►ALSO READ | 981 రోజుల తర్వాత వరల్డ్ కప్లోకి నెయ్మార్.. గ్రౌండ్లోనే ఏడ్చేసిన బ్రెజిల్ స్టార్!
ఇంగ్లాండ్ టూర్ T20I షెడ్యూల్:
* 1st T20I: జూలై 1 (చాస్టర్-లీ-స్ట్రీట్) - రాత్రి 10:00 PM
* 2nd T20I: జూలై 4 (మాంచెస్టర్) - రాత్రి 7:00 PM
* 3rd T20I: జూలై 7 (నాటింగ్‌హామ్) - రాత్రి 10:00 PM
* 4th T20I: జూలై 9 (బ్రిస్టల్) - రాత్రి 10:00 PM
* 5th T20I: జూలై 11 (సౌతాంప్టన్) - రాత్రి 7:00 PM
భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సూర్యాంష్ షెడ్గే, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ ( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఐర్లాండ్ టీమ్: లార్కాన్ టక్కర్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్, మాథ్యూ హోలార్డ్, లియామ్ మెక్‌కార్తీ, జై మూంద్రా, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, రూబెన్ విల్సన్.
The hunt begins tomorrow in Belfast.⚔️
— Sony Sports Network (@SonySportsNetwk) June 25, 2026
Get ready for high-voltage T20I action as the Men in Blue take charge.🔥
Watch the #IREvIND 1st T20I tomorrow, 5:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels 📺 & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/M6PMIMvKLW
Touchdown Belfast 🛬
— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2026
The Men in Blue have arrived. The Irish challenge awaits. ⚔️
Watch #IREvIND 2 T20Is on 26th and 28th June, 5:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/keGHLdR1dS
