ఇరాన్ యుద్ధంలోకి దిగబోతున్నాం: ట్రంప్ ప్రకటనతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా..?

ఇరాన్ యుద్ధంలోకి దిగబోతున్నాం: ట్రంప్ ప్రకటనతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా..?

Iran-Isreal War: గడచిన ఆరు రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు తారా స్థాయికి చేరాయి. అమెరికా పదేపదే హెచ్చరించినప్పటికీ అవి అస్సలు పట్టించుకోని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ. ఇరాన్ లొంగిపోదని ఖమేనీ తాజాగా ఒక టీవీ ప్రసంగం ద్వారా ప్రకటించారు. ఏదైనా US సైనిక జోక్యం కోలుకోలేని నష్టాన్ని తెస్తుందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ రాత్రి దాడుల తర్వాత వేల మంది ప్రజలు టెహ్రాన్ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయిన తరుణంలో ఖమేనీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా యుద్ధంలోకి దిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే మరోపక్క అమెరికా మాత్రం ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే అంశంపై ఆలోచినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఇరాన్ బేషరతుగా సరెండర్ కావాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపును తిరస్కరిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన తాజా టీవీ ప్రసంగంలో వెల్లడించారు. ఈ పరిస్థితులు ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం దిశగా దారితీస్తున్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇరాన్ దేశంతో యుద్ధం ఇజ్రాయెల్ కు భారీ భారంగా మారుతోంది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఇంటర్ సెప్టార్లు కేవలం 10 రోజులకు సరిపోతాయని వెల్లడైంది. ఈ తరుణంలో అమెరికా నుంచి సరఫరాలు పెంచుకోవటం లేదా నేరుగా అమెరికా సైనికులు యుద్ధ రంగంలోకి దిగటం అనే రెండు చివరి ఆప్షన్లు మిగిలి ఉన్నాయని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. 

ALSO READ | ఇరాన్లో ఇంటర్నెట్ బంద్..సెల్ సిగ్నల్ డౌన్..

ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడుల నుంచి తనను తాను రక్షించుకునే "చట్టబద్ధమైన" హక్కు ఇరాన్‌కు ఉందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష సైనిక సహాయం అందించడం వల్ల మధ్యప్రాచ్యం తీవ్రంగా అస్థిరపడుతుందని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ బుధవారం హెచ్చరించారు. గడచిన 5 రోజుల్లో ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఇరాన్ లోని 1100 ప్రాంతాల్లో బాంబుల మోత మోగింది. 

ఇరాన్ కి ట్రంప్ వార్నింగ్..
సుప్రీం లీడర్ అని చెప్పుకుంటున్న  ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో ఖచ్చితమైన ప్రదేశం తమకు తెలుసని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో అన్నారు. ఆయన తమకు చాలా ఈజీ టార్గెట్ అని, అయితే అతడిని తాము చంపాలని అనుకోవటం లేదని చెప్పారు. కనీసం ప్రస్తుతానికి చంపే ఉద్దేశంలో లేనట్లు చెప్పారు. అయితే తాము సామాన్య ప్రజలు, అమెరికా సైనికులపై దాడులను సహించబోమని హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని.. దీనిని మీరు త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయని తాను భావిస్తున్నట్లు ఖమేనీకి వార్నింగ్ ఇచ్చారు.