జై హనుమాన్లో హనుమంతుడిగా రానా.. హింట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

జై హనుమాన్లో హనుమంతుడిగా రానా.. హింట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varama) కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్(HanuMan). సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా..  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హనుమంతుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. కేవలం 15 రోజుల్లోనే ఏకంగా రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. హనుమాన్ సినిమాకు సీక్వల్ గా జై హనుమాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ సినిమాలో శ్రీరాముడికి ఇచ్చిన మాట కోసం హనుమంతులవారు ఎం చేశారు అనేది సీక్వల్ లో చుపించబోతున్నాం అనే హింట్ ఇచ్చి వదిలేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా ఒక స్టార్ హీరో కనిపిస్తారని కూడా చెప్పేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? హనుమంతుడిగా కనిపించబోయే ఆ స్టార్ హీరో ఎవరు? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. 

ఇందులో భాగంగానే జై హనుమాన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కు జై హనుమాన్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాలో రానా హనుమంతుడిగా కనిపిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా అని అడిగారు. దానికి సమాధానంగా.. ఖచ్చితంగా రానా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతారు అంటూ కామెంట్స్ చేశారు. దాంతో జై హనుమాన్ లో హనుమంతుడిగా కనిపించేది రానానే అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ ఐపోతున్నారు. అంతేకాదు.. హనుమాన్ సినిమా చివర్లో కనిపించే యానిమేటెడ్ హనుమాన్ కళ్ళు కూడా అచ్చం రానా కళ్లలాగే ఉన్నాయి. కాబట్టి.. జై హనుమాన్ లో ఖచ్చితంగా రానా హనుమాన్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ విషయం త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.