తాతయ్య చిరు ఒడిలో క్లీంకార..భలే క్యూట్గా ఉంది

తాతయ్య చిరు ఒడిలో క్లీంకార..భలే క్యూట్గా ఉంది

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మనవరాలు క్లింకార (Klinkaara)తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో చిరు తన మ‌న‌వ‌రాళ్ల‌తో కలిసి ఉన్న ఫోటో భలే ముచ్చటగా ఉంది. ముఖ్యంగా ఈ ఫొటోలో క్లీంకార స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది.ఈ ఫొటోలో క్లీంకార ఎంతో ముద్దుగా..ఎరుపు రంగు గౌను వేసుకుని..తాతయ్య చిరు ఒడిలో కూర్చొని..చిరునవ్వుల చిందిస్తున్న క్లీంకార నెటిజన్స్ని ఆకట్టుకుంటోంది.

చిరంజీవికి ప‌ద్మ‌ విభూష‌ణ్ అవార్డు రావడంతో..మెగా ఫ్యామిలీ అంత కలిసి ఇంట్లో సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడ చిరు తన మానవరాళ్లతో ఉన్న ఫోటోని మెగా కోడలు ఉపాసన (Upsana) ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసింది. అలాగే చిరంజీవిపై ఉన్న తన అభిమానాన్ని పంచుకుంటూ..

'మీరు చూసేది శక్తివంతమైన పిడికిలిని ఏర్పరుచుకునే ఐదు వేళ్లు..కేవలం సినిమా, సమాజసేవనే కాకుండా..జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాలో నింపిన స్ఫూర్తికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్..లవ్ యూ' అంటూ ఉపాసన పోస్ట్లో తెలిపింది. 

చిరంజీవి తన మ‌న‌వ‌రాళ్ల‌తో దిగిన ఈ ఫొటోలో ఉన్నవారిని గమనిస్తే..అందులో పెద్ద కుమార్తె సుష్మిత ఇద్దరు పిల్లలు..చిన్న కుమార్తె శ్రీజ ఇద్దరు పిల్లలతో పాటు రామ్ చరణ్..ఉపాసన క్యూట్ డాట‌ర్ క్లింకారా ఉన్నారు. అయితే..ఈ ఫొటోలో కూడా క్లీంకార ముఖాన్ని మాత్రం బ్ల‌ర్ చేసారు. చాలా క్యూట్గా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మనవరాలు క్లీంకార తమ ఇంట అడుగుపెట్టిన తరువాత రామ్ చరణ్కి ఇంటర్నేషన్ల్ వైడ్గా అవార్డ్స్ రావడం..అలాగే చిరంజీవికి దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించడం అంత శుభపరిణామం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.