Bobby Deol : ఉదిరన్గా యానిమల్ విలన్..కంగువతో క్రూరత్వం బిగిన్

Bobby Deol : ఉదిరన్గా యానిమల్ విలన్..కంగువతో క్రూరత్వం బిగిన్

కొంతమంది హీరోలు నటించడానికి..అది ఎటువంటి క్యారెక్టర్ అయిన..ఆ పాత్రల్లో ఇమిడిపోవడానికి చాలా కష్టపడుతుంటారు. సౌత్ లో క్యారెక్టర్ రైజేషన్లో కష్టం అనే మాట విన్నాం అంటే..ముందు గుర్తొచ్చే హీరో తమిళ స్టార్  హీరో విక్రమ్.

అలాగే హీరో సూర్య, కార్తి, తెలుగులో అల్లు అర్జున్,ఎన్టీఆర్,రానా లాంటి వారు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తమని తాము ఎలా అయిన మలుచుకోవడానికి రెడిగా ఉంటారు. ఇప్పుడు అదే కోవలోకి మారిపోయాడు యానిమల్ (Animal) విలన్ బాబీ డియోల్ (BobbyDoel).

బాలీవుడ్లో హీరోగా చేస్తూనే..క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ..ప్రెజెంట్ మోస్ట్ వైలెంట్ విలన్గా పేరు తెచ్చుకున్నారు. యానిమల్ మూవీలో బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాబీ డియోల్ తన స్టైలిష్ లుక్స్తో  పాటు మోస్ట్ వైలెంట్ విలన్గా అదరగొట్టేసాడు.

యానిమల్ సక్సెస్తో మంచి జోష్లో ఉన్న బాబి డియోల్కి సౌత్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువ' మూవీలో మరోసారి విలన్ రోల్ చేస్తున్నారు. ఇవాళ (జనవరి 27న) బాబీ డియోల్ బర్త్డే స్పెషల్గా కంగువా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

భీకరమైన గంభీరాన్ని చూపిస్తూనే..తన ఒంటికన్నుతో భయపెట్టేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే బాబీ డియోల్ మరోసారి ఆడియన్స్కు తన అవతారమంతో..తన పెర్ఫార్మన్స్తో అదరగొట్టడం కన్ఫమ్ అనేలా ఉంది. కంగువలో 'ఉదిరన్'గా తన క్రూరత్వంతో రాబోతున్న బాబీ..ఈ క్యారెక్టర్తో మరోసారి క్లిక్ అయితే..మరిన్ని సినిమాలు తన చేతిలోకి రావడం పక్కా అనే విషయం తెలుస్తోంది.

గుబురు గడ్డం, పొడవాటి జుట్టు దానిపై జింక కొమ్ములు తగిలించుకొని తనలోని కోణాన్ని బయటపెట్టిన డైరెక్టర్ శివ ..కంగువ సినిమాని ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు.కంగువ సినిమాను వరల్డ్ వైడ్గా 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇన్ని భాషల్లో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.  

సూర్య 42వ మూవీగా తెరకెక్కుతున్న కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శివ (Shiva) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను యూవీ క్రియేషన్స్ (UV Creations), స్టూడియో గ్రీన్(Studio green) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ మూవీ ఈ ఏడాది 2024 ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.