నాయుడు సామ్రాజ్యం కూలే టైం వచ్చింది! 90s బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న 'ఇసకపట్నం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాయుడు సామ్రాజ్యం కూలే టైం వచ్చింది! 90s బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న 'ఇసకపట్నం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించడానికి టాలీవుడ్ నుంచి మరో క్రేజీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన 'ఇసకపట్నం' (Isakapatnam) గ్లోబల్ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ ఏడాది మార్చి 29న గ్రాండ్‌గా ప్రకటించిన ఈ సిరీస్, రాబోయే జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో గ్రాండ్ డిజిటల్ డెబ్యూ ఇవ్వబోతోంది. ఈ మేరకు మేకర్స్ వదిలిన సరికొత్త పోస్టర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కథేంటంటే.. 

1990ల నాటి వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, ఒక రసవత్తరమైన కోస్తా తీర ప్రాంత పోర్ట్ టౌన్ వేదికగా ఈ కథ సాగుతుంది. నేరం, రాజకీయం, గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరిగే ఈ సిరీస్‌లో.. ఆ ఊరిని శాసించే అత్యంత శక్తివంతుడైన 'నాయుడు' అనే వ్యక్తి సామ్రాజ్యాన్ని కూల్చడానికి మూడు వేర్వేరు శక్తులు ఎలా తలపడ్డాయి అనేదే మెయిన్ .. న్యాయం కోసం పోరాడే ఒక పవర్‌ఫుల్ మహిళ, తీవ్రమైన నైతిక సంఘర్షణలో కొట్టుమిట్టాడే ఒక నమ్మకస్థుడైన అనుచరుడు, ప్రతీకారం కోసం రగిలిపోయే ఒక సామాన్యుడు.. ఈ ముగ్గురి జీవితాలు నాయుడుపై చేసే ఒక ప్రమాదకరమైన ఆపరేషన్‌లో ఎలా ముడిపడ్డాయి? అనే ఇంటెన్సిటీతో డైరెక్టర్ గ్యారీ బి.హెచ్ (Garry BH) ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు..

భారీ తారాగణం...

సస్పెన్స్, యాక్షన్‌తో పాటు మానవీయ సంబంధాలు, నమ్మకద్రోహం వంటి ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh), సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మైమ్ గోపి, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రోహిణి, రాజీవ్ కనకాల, రాజా చెంబోలు వంటి భారీ కాస్టింగ్ ఈ సిరీస్‌లో భాగమయ్యారు. ప్రశాంత్ రాగతి కథ అందించగా, తజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ రాశారు. తమడ మీడియా  మీడియా (Tamada Media) బ్యానర్‌పై రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా ఈ సిరీస్‌ను  నిర్మించారు.

 

 బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్‌లతో..

 'ఇసకపట్నం'తో అదరగొట్టడానికి రెడీ అయిన టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్.. కన్నడ ఇండస్ట్రీలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అమోఘ్ విజయ్ దర్శకత్వంలో, అమెరికాకు చెందిన 'మ్యావ్రిక్ ప్రొడక్షన్స్' నిర్మిస్తున్న ఒక భారీ చిత్రంలో ఆమె నటిస్తోంది. వచ్చే సెప్టెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మొత్తానికి ఈ అమ్మడు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్‌లతో దూసుకుపోతోంది.

ALSO READ : ‘థియేటర్ నుంచి ఓయో రూమ్తో ఎండ్’..