Allu Aravind: ‘థియేటర్ నుంచి ఓయో రూమ్తో ఎండ్’.. ఇప్పటి లవ్ స్టోరీలపై అల్లు అరవింద్ కామెంట్స్

Allu Aravind: ‘థియేటర్ నుంచి ఓయో రూమ్తో ఎండ్’.. ఇప్పటి లవ్ స్టోరీలపై అల్లు అరవింద్ కామెంట్స్

‘శుభం’ సినిమాతో సక్సెస్‌‌‌‌ అందుకున్న యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా  ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి యూత్లో అంచనాలు పెంచారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీవానా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విశ్వక్ సేన్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. విశ్వక్ సేన్, అల్లు అరవింద్ మధ్య జరిగిన సరదా సంభాషణలు సభలో నవ్వులు పూయించాయి. గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఎప్పుడూ గ్లామర్‌గా ఎలా ఉంటారంటూ విశ్వక్ అడిగిన ప్రశ్నకు సభ నవ్వులతో మార్మోగింది. ఈ క్రమంలోనే వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి విశ్వక్ అడగగా, “ఒకటా రెండా.. లెక్కలేనన్ని ఉన్నాయి” అని అరవింద్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత లవ్ స్టోరీలు థియేటర్లు, షాపింగ్‌లు, చివరకు ఓయో రూమ్స్ వద్ద ఎండ్ అవుతున్నాయి అని అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“సాధారణంగా సినిమాలు నిర్మించే కొద్దీ నిర్మాతల ముఖాల్లో ఒత్తిడి కనిపిస్తుంది, జుట్టు కూడా తగ్గిపోతుంది. కానీ అల్లు అరవింద్ గారి క్యాంప్ నుంచి వచ్చిన నిర్మాతలు మాత్రం మరింత స్మార్ట్‌గా తయారవుతున్నారు. వాసు, ధీరజ్, SKN లాంటి వాళ్లు నిర్మాతలయ్యాక ఇంకా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆ సీక్రెట్ మాకూ చెప్పండి సార్” అని విశ్వక్ సరదాగా అడిగాడు.

►ALSO READ | Janhvi Kapoor: అందాల ఆరబోతకు భారీ పారితోషకం.. ‘పెద్ది’ కోసం జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందంటే?

స్పందించిన అల్లు అరవింద్, “నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నావు” అంటూ చమత్కరించారు. వెంటనే స్పందించిన విశ్వక్, “సార్ మీకేం తక్కువ? బోలెడు డబ్బులున్నాయి. ఈ అల్లు సినిమాస్ మీది, మీరు కూర్చున్న కుర్చీ కూడా మీదే. మాలాంటి వాళ్లకు కొంచెం ఇస్తే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది” అంటూ నవ్వులు పంచాడు.

అలాగే హీరో హర్షిత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, “హర్షిత్ దిల్‌సుఖ్‌నగర్ నుంచి హీరోగా వస్తున్నాడు. అతని కోసమే నేను ఈ ఈవెంట్‌కు వచ్చాను” అని చెప్పాడు. ఈ సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్‌లో స్టూడియో నిర్మించాలని, అవసరమైతే తన స్థలం కూడా ఇస్తానంటూ అల్లు అరవింద్‌కు సరదాగా సూచించాడు.

ఇదే సమయంలో అల్లు అరవింద్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించిన విశ్వక్, ఆయనను వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి ప్రశ్నించాడు. “సార్, మీకు ఎప్పుడైనా వన్ సైడ్ లవ్ స్టోరీలు ఉన్నాయా?” అని అడగగా, “ఒకటా... రెండా...? లెక్కలేనన్ని ఉన్నాయి” అంటూ అల్లు అరవింద్ సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత ప్రస్తుత తరం ప్రేమకథలపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ఇప్పటి లవ్ స్టోరీలు ఎలా ఉంటాయంటే... ముందుగా జనాలు తక్కువగా ఉండే థియేటర్‌కి వెళ్లడం, కార్నర్ సీట్లో కూర్చోవడం, తర్వాత రెండు షాపింగ్‌లకు వెళ్లడం, చివరకు ఓయోలో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం చాలా ప్రేమకథలు ఇదే తరహాలో సాగుతున్నాయి” అంటూ ఆయన సరదాగా మాట్లాడారు.

అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన హాస్య చతురత, విశ్వక్ సేన్ ఎనర్జీ కలిసిపోవడంతో ‘దీవానా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.