Janhvi Kapoor: అందాల ఆరబోతకు భారీ పారితోషకం.. ‘పెద్ది’ కోసం జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందంటే?

Janhvi Kapoor: అందాల ఆరబోతకు భారీ పారితోషకం.. ‘పెద్ది’ కోసం జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన నాయికగా నటించిన జాన్వీ కపూర్.. ‘అచ్చియమ్మ’ క్యారెక్టర్‌ సోషల్ మీడియాలో మార్మోగుతుంది. ‘పెద్ది’లో జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయినప్పటికీ, అచ్చియమ్మ పాత్రను చూపించిన విధానం, కొన్ని కెమెరా యాంగిల్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. తెరపై మహిళలను కమర్షియల్ వస్తువులా చూపించారంటూ ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు, మహిళా ప్రేక్షకులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వివాదాల మధ్య జాన్వీకి ‘పెద్ది’ కోసం ఎంత పారితోషికం ఇచ్చారనే విషయం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ బాలీవుడ్ నివేదికల ప్రకారం, జాన్వీ కపూర్ ‘పెద్ది’ చిత్రానికి దాదాపు రూ.8 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్‌ అని టాక్. ఈ విషయంపై ఓ సినీ క్రిటిక్ కూడా కన్ఫామ్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. “జాన్వీ తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ‘పెద్ది’ కోసం అందుకుంది. సెట్స్‌లో ఆమె పూర్తి ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. ‘దేవర’ సినిమాకు ఆమె రూ.5 కోట్లు తీసుకోగా, ‘పెద్ది’ కోసం దాదాపు 50 శాతం ఎక్కువగా తీసుకుంది” అని తెలిపినట్లు సమాచారం. 

జాన్వీకి పెరుగుతున్న డిమాండ్..

‘దేవర’, ‘పెద్ది’ వంటి సినిమాల విజయాలతో జాన్వీ కపూర్‌కు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మరింత హీట్ పెంచేలా జాన్వీ.. తెలుగులో అల్లు అర్జున్ ‘రాకా’లో కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే, రాకా' తో అల్లు ఫ్యాన్స్ విజిల్స్ వేసుకోవాల్సిందే.

ఈ బడా సినిమాలతో తెచ్చుకున్న క్రేజ్, జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తాయని స్పష్టమైంది. ఈ క్రమంలోనే జాన్వీ రెమ్యునరేషన్ మరింత పెరిగి, దక్షిణాదిలోనూ స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని బలపరుచుకుంటోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, జాన్వీ కపూర్ ‘లగ్ జా గలే’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 మేలో విడుదల కానుంది. అలాగే, ‘తుంబాడ్’ దర్శకుడు రాహి అనిల్ బర్వే తెరకెక్కించే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా జాన్వీ నటించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు

►ALSO READ | PEDDI OTT: ‘పెద్ది’ వారం రోజుల కలెక్షన్స్ అనౌన్స్..

‘అచ్చియమ్మ’ పాత్రపై కొనసాగుతున్న వివాదం..

తెలుగులో ‘దేవర’ తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కు ఆ చిత్రంలో పెద్దగా స్కోప్ దక్కలేదు. అయితే ‘పెద్ది’లో అచ్చియమ్మ పాత్రతో ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినప్పటికీ అది కాస్తా వివాదంగా మారింది. 'ఫైర్స్ అండ్ ఫియర్‌లెస్' క్యారెక్టర్ లో తనదైన అందాలతో మెప్పించగా.. అతిగా గ్లామరస్‌గా చూపించారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపించాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే క్షమాపణలు చెప్పడమే కాకుండా, ప్రేక్షకుల అభ్యంతరాలకు అనుగుణంగా సినిమాలో కొన్ని సీన్స్ కూడా కట్ చేసాడు. అయితే, ఈ వివాదంపై జాన్వీ కపూర్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.