Isha Talwar: 36 ఏళ్లు వయసొచ్చిన..తల్వార్ తళుక్కుమనే అందం

Isha Talwar: 36 ఏళ్లు వయసొచ్చిన..తల్వార్ తళుక్కుమనే అందం

నితిన్ గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇషా తల్వార్(Isha Talwar). ఈ అమ్మడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా చేసిన కొన్ని సినిమాలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలకు, వీడియోలకు మంచి రెస్పాన్స్‌ వస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఇషా హిందీ, తమిళ, మలయాళ సినిమాలతో కెరీర్లో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం తన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా మళ్లీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుందా అనే చర్చ నెటిజన్స్లో మొదలైంది. కవ్వించే చూపులతో, నాజుకు అందాలతో ఈ అమ్మడు ఎప్పుడు ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి మాత్రం అంతకు మించిన అందంతో ముద్దుగుమ్మ ఇషా తల్వార్  కను విందు చేస్తోంది. ఇంతటి అందాన్ని తెలుగు ప్రేక్షకులు మిస్‌ అవుతున్నారామో? అనే అంతలా ఫొటోస్ లో కనిపిస్తుంది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మీర్జాపూర్ లాంటి ఫేమస్ వెబ్ సిరీస్‌లోనూ నటించి మరింత ఫేమస్ అయింది. 36 ఏళ్లు వయసొచ్చినా..ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఈ బ్యూటీకి టాలీవుడ్ మేకర్స్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Isha Talwar (@talwarisha)