Kaatera OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాటేరా..ఐదు రోజుల్లోనే హైయెస్ట్ స్ట్రీమింగ్ మినిట్స్

Kaatera OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాటేరా..ఐదు రోజుల్లోనే హైయెస్ట్ స్ట్రీమింగ్ మినిట్స్

కన్నడ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ (Darshan) నటించిన లేటెస్ట్ మూవీ కాటేరా (Kaatera). ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయింది. కన్నడ భాషలోనే రిలీజైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఫిబ్రవరి 9న ఓటీటీ  ప్లాట్ఫామ్ జీ5 లోకి రిలీజై దూసుకెళుతోంది.

అంతేకాదు..ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాటేరా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది. దీంతో ఈ మూవీ ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేసిందంటూ జీ5 ఓటీటీ వెల్లడించింది. కేవలం ఒకే భాషలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా..ఇంత స్ట్రీమింగ్ మినిట్స్ దాటిందంటే అర్ధం చేసుకోవొచ్చు. ఇతర భాషల వారు కూడా ఇంగ్లిష్ సబ్‍టైటిళ్లతో ఈ కటేరా చూస్తున్నారని.

సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తోతెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రూ.104కోట్ల కలెక్షన్లను సాధించింది. రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్పై రాక్‍లైన్ వెంకటేశ్ నిర్మించిన కాటేరా చిత్రానికి వి.హరికృష్ణ మ్యూజిక్ అందించారు.

కాటేరా స్టోరీ విషయానికి వస్తే.. 

భూస్వాముల చేతుల్లో రైతులు, నిమ్నవర్గాల ప్రజలు అణచివేతకు గురవడం వంటి ప్రధాన అంశాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.   ముసలితనంలో ఉన్న కాటేరా (దర్శన్) జైలులో కనిపించడంతో సినిమా మొదలవ్వగా..పెరోల్‍పై తన గ్రామానికి కానిస్టేబుల్ (అచ్యుత్ కుమార్)తో పాటు వెళతాడు. ఆ తర్వాత అక్కడ కాటేరాపై ఒక భయంకరమైన దాడి జరుగుతుంది. అప్పుడు 1970ల కాలంలో జరిగిన విషయాలను కానిస్టేబుల్‍కు కాటేరా వివరిస్తాడు. దీంతో అసలు కథ షురూ అవుతుంది.

1970 సమయంలో రైతులకు భూములు దక్కేలా కాటేరా చేయగలిగాడా? భూస్వాముల నుంచి పేద రైతులను రక్షించాడు.?  భూస్వాములు చేసే దాడులను ఎలా ఎదుర్కొన్నాడు? అలా గ్రామంలో దొరిగిన అస్థిపంజరాలతో కాటేరాకు ఉన్న సంబంధం ఏంటి? అతడు జైలుకు ఎందుకు వెళ్లాడు? అనే అంశాలతో ఆసక్తికరమైన కథనంతో నడుస్తుంది.