ఎన్టీఆర్​ దేవరలో మరో బ్యూటీ! అవకాశం దక్కేనా..

ఎన్టీఆర్​ దేవరలో మరో బ్యూటీ! అవకాశం దక్కేనా..

ఇస్మార్ట్​ బ్యూటీ నభా నటేష్​ కెరీర్​ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆమె రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా సినిమాలకు ఆమె పూర్తిగా దూరమైంది. తిరిగి కోలుకున్న తర్వాత కూడా పెద్దగా అవకాశాలు లేకుండాపోయాయి. ఇప్పుడు ఏకంగా బంపర్​ ఆఫర్​ కొట్టేసింది. 

లేటెస్ట్ గా ఎన్టీఆర్​ ‘దేవర’లో సెకండ్​ హీరోయిన్​గా ఈ నటిని సెలక్ట్​ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాతో బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ తెలుగు తెరకు పరిచయమవుతోంది. సినిమాలో కొన్ని కీలక సీన్స్​ కోసం మరో హీరోయిన్​ను కొంతకాలంగా మూవీ టీం వెతుకుతోంది.

Also Read:- నాకేంకాలేదు.. నేను బాగానే ఉన్నా

ఈ ఆఫర్​ ఈ ఇస్మార్ట్​ బ్యూటీకే దక్కిందని టాక్​ నడుస్తోంది. అవకాశాల సంగతి ఎలా ఉన్నా ఆమె సోషల్​ మీడియా ఫాలోవర్ల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పండగపూట అచ్చతెలుగు అమ్మాయిలా లంగావోణి ఫొటోలు పోస్ట్​ చేసి వైరలవుతోంది ఈ బ్యూటీ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

ఈ సినిమాను 2024 ఏప్రిల్  5న రిలీజ్ చేయనున్నారు. సముద్రతీరంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తు్న్నాడు.