నాకేంకాలేదు.. నేను బాగానే ఉన్నా.. పుకార్లను నమ్మొద్దు..

నాకేంకాలేదు.. నేను బాగానే ఉన్నా.. పుకార్లను నమ్మొద్దు..

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వెలుగులోకి వస్తున్నాయి. ..  తాజాగా ఆయన కార్డియాక్ అరెస్ట్‌ కు గురయ్యారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. గుండె పోటు రావడంతో పుతిన్ మంచం మీది నుంచి కింద పడిపోయారని.. తాజాగా వార్తలు సంచలనంగా మారుతున్నాయి. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు స్వదేశంలో ప్రచారం జరిగింది. ఆయన ఉన్నట్లుండి పడిపోయారని, పక్కనే ఉన్న మందుల్ని కూడా కాలితో తన్నేశారని కూడా వార్తలొచ్చాయి. ఈ మధ్యకాలంలో పుతిన్ ఆరోగ్యంపై వరుసగా పుకార్లు చెలరేగుతున్న వేళ గుండెపోటు గురించి రష్యన్లతో పాటు అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్  దీనిపై స్పందించింది. రష్యా అధ్యక్షుడు  పుతిన్  పార్కిన్సన్‌ బారినపడ్డారని, అందుకే బహిరంగ ప్రదేశాల్లో వణుకుతా కనిపిస్తున్నారని కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో... పుతిన్‌ కు క్యాన్సర్‌ వ్యాధి ఉందని.. అయితే ఈ వ్యాధికి రహస్యంగా చికిత్స తీసుకుంటున్నారని మరో ప్రచారం కూడా జరగింది. ఈ నేపథ్యంలో... తాజాగా గుండెపోటు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో స్పందించిన క్రెమ్లిన్.. ఈ పుకార్లను తోసిపుచ్చింది . ఆయన ఆరోగ్యంగా, బాగానే ఉన్నారని ధృవీకరించింది. జర్నలిస్టులతో ఒక సాధారణ బ్రీఫింగ్ సందర్భంగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్.. అధ్యక్షుడు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తున్నారనే వాదనలను ఖండించారు. దీన్నో బూటకపు ప్రచారంగా ఆయన తోసిపుచ్చారు. కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు ప్రసారం చేసిన రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ నుండి ధృవీకరించని నివేదికల నేపథ్యంలో విలేకరులు పుతిన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీనిపై రష్యన్లలోనూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్లెమ్లిన్ వర్గాలు స్పందించాయి. 2022 నుండి పుతిన్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు పలు రిపోర్టులు వచ్చాయి. పుతిన్ బహిరంగంగా కనిపించినప్పుడు నిలబడలేకపోతున్నట్లు, ఆయన శరీరం ఉబ్బినట్లుగా కనిపించడం కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోసింది.

Also Read:- కాంగ్రెస్ లో ఇలాగే ఉందా.. : ఢిల్లీ నుంచి పిలుపా

 పుతిన్‌ కొద్ది రోజుల పాటు అజ్ఞాతంగా ఉండటం, ఎవరినీ కలుసుకోకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చిందని అంటున్నారు. ఈ సమయంలో రష్యా అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఇదే సమయంలో సోమవారం (అక్టోబర్ 23) సాయంత్రం బ్రెజిల్ అధ్యక్షుడితో పుతిన్ ఫోన్‌ లో సంభాషించినట్టు తెలిపారు. ఇదే సమయంలో 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్.. అక్టోబర్ 23న రోజంతా అధికారిక విధులను కొనసాగించారని, అదేవిధంగా... రష్యాలోని ఓ ప్రాంతానికి చెందిన గవర్నర్‌ ను కూడా ఆయన కలిశారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. ఫైనల్ గా... ఈ పుతిన్ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే ఎప్పటికప్పుడు రష్యా ప్రభుత్వం ఈ వార్తల్ని ఖండిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా గుండెపోటు పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని కూడా క్రెమ్లిన్ తోసిపుచ్చడంతో ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్దంపై దృష్టిపెట్టిన పుతిన్.. ఆ వ్యూహాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.యితే రష్యాలో రిపోర్టింగ్ చేస్తున్న ఒక ఛానెల్ ముందుగా పుతిన్ గుండెపోటు గురించి తప్పుడు వార్తలను ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. అక్టోబర్ 22 ఆదివారం రాత్రి పుతిన్‌ కు గుండెపోటు వచ్చిందని ఆ ఛానల్ తొలుత ప్రకటించిందంట. ఇంక అక్కడ నుంచి అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా ఆ వార్త దావాణంలా వ్యాపించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో పుతిన్ కి గుండెపోటు రావడం వల్ల మంచం మీద నుండి పడిపోయారని.. అలా పడిపోయే క్రమంలో టేబుల్ ముఖానికి తగిలిందని.. దీంతో ముక్కుకు గాయం అయ్యి తీవ్ర రక్తస్రావం అయ్యిందని వార్తలు వచ్చేశాయి. దీంతో అది గమనించిన భద్రతా సిబ్బంది.. వైద్యుడికి సమాచారం అందించినట్టు కథనాలు వెలువడ్డాయి. దీంతో... అధికారులు స్పందించి... అది తప్పుడు సమాచారం అన్ని స్పష్టం చేశారు. ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయొద్దన్ని సీరియస్ అయ్యారు.