అల్లాడిపోతున్నారమ్మా సిగరెట్ ప్రియులు.. సిగరెట్ ధరలు చూస్తే కన్నీళ్లే.. ఏ బ్రాండ్ రేటు చూసినా ఏడుపొక్కటే తక్కువ !

అల్లాడిపోతున్నారమ్మా సిగరెట్ ప్రియులు..  సిగరెట్ ధరలు చూస్తే కన్నీళ్లే.. ఏ బ్రాండ్ రేటు చూసినా ఏడుపొక్కటే తక్కువ !

సిగరెట్ ధరలు అమాంతం పెరిగాయి.. అలా ఇలా కాదు.. కలలో కూడా ఇంత పెరుగుతాయని ఊహించలేని విధంగా సిగరెట్ ధరలు పెరిగిపోయాయి. ప్రధాన మంత్రి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత.. సిగరెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని లేదు.. అన్ని సిగరెట్లు గుండెలు అదిరేలా ధరలు పెరిగాయి. వామ్మో.. సిగరెట్ రేట్లు ఇంత పెరిగాయా అనే విధంగా సిగరెట్ ప్రియులు అవాక్కయ్యేలా ఉన్నాయి ధరలు. 

* గోల్డ్ ఫ్లేక్ కింగ్.. 10 సిగరెట్ల ప్యాకెట్ గతంలో 170 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 240 రూపాయలు. అంటే ప్యాకెట్ 70 రూపాయలు పెరిగింది. ఒక్క సిగరెట్ 24 రూపాయలు. గతం కంటే ఒక్క సిగరెట్ ధరనే 7 రూపాయలు పెరిగింది.

* క్లాసిక్ రెగ్యులర్, మైల్డ్, ఆల్ట్రా సిగరెట్ల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇవి 20 ప్యాకెట్ ఉంటుంది. గతంలో 340 రూపాయలు. ఇప్పుడు 480 రూపాయలు చేశారు. అంటే ప్యాకెట్ పై 140 రూపాయలు పెరిగింది. ఒక్క సిగరెట్ ధర 24 రూపాయలు. 

* క్లాసిక్ కనెక్ట్ (స్లిమ్) ఇది 20 ప్యాకెట్. గతంలో 300 రూపాయలు ఉండేది.. ఇప్పుడు 360 రూపాయలకు చేరింది. అంటే ప్యాకెట్ పై 60 రూపాయలు పెంచారు. ఒక్క సిగరెట్ ధర 18 రూపాయలకు పెరిగింది. 

* ఇక గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్. 10 సిగరెట్ల ప్యాకెట్. మొన్నటివరకూ 59 రూపాయలుగా ఉంటే.. ఇప్పుడు 70 రూపాయలకు పెంచారు. అంటే ప్యాకెట్ పై 11 రూపాయలు పెరిగింది. ఒక్క సిగరెట్ ధర 7 రూపాయలకు చేరింది. 

* ఒక్క గోల్డ్ ఫ్లేక్ బ్రాండ్ ఒక్కటే కాదు.. ఆ బ్రాండ్.. ఈ బ్రాండ్ అని తేడా లేకుండా.. అన్ని సిగరెట్లపై ధరలు అమాంతం పెరిగిపోయాయి. బడ్జెట్ ముందు కంటే.. ఇప్పుడు ధరలు 40 శాతంపైనే పెరిగాయి.

* చిన్న సైజ్ సిగరెట్లపైనా 2 నుంచి 3 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు వ్యాపారులు. ధరల పెంపుతో చాలా చోట్ల సిగరెట్ల కొరత ఏర్పడింది. కొత్త ధరతో కొత్త స్టాక్ వచ్చే వరకు ఈ తిప్పలు తప్పవు అంటున్నారు వ్యాపారులు. కొత్త స్టాక్ ఇంకా రాకపోయినా.. పెరిగిన ధరలను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ వ్యాపారులు ధరలను పెంచి అమ్ముతున్నారు. 

* సిగరెట్ ధరలు ఈ స్థాయిలో.. ఇంత ఎక్కువగా ఒకే సారి పెరగటం అనేది ఇప్పుడే అంటున్నారు వ్యాపారులు. గతంలో రూపాయి.. 2 రూపాయలు మాత్రమే పెరిగాయని.. ఇప్పుడు ఒక్క సిగరెట్ పైనే 4, 5 రూపాయలు పెరిగిందంటున్నారు వ్యాపారులు.

పెరిగిన ధరలతో జేబులు గుల్ల చేసుకోలేక.. అలా అని సిగరెట్ తాగటం మానేయలేక సతమతం అవుతున్నారు సిగరెట్ ప్రియులు. చిన్న సిగరెట్లకు దిగి వస్తున్నారు. ధర తక్కువగా ఉండే సిగరెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత నెలలో ఇబ్బడిముబ్బడిగా దొరికే చిన్న సిగరెట్లకు.. ఇప్పుడు మార్కెట్లో కొరత వచ్చింది. గతంలో పెద్ద సిగరెట్లు స్టాక్ లేకపోతే.. చిన్న సిగరెట్లను అంటగట్టేవాళ్లు రిటైల్ వ్యాపారులు. ఇప్పుడు ధరలు పెరగటంతో.. చిన్న సిగరెట్ల లేవు అంటూ పెద్ద సిగరెట్లను ఇస్తున్నారు.. కారణం ఏంటో తెలుసా.. పెద్ద సిగరెట్ ఒక్కటి 24 రూపాయలు..

పాపం సిగరెట్ ప్రియులు.. తాగకుండా ఉండలేరు.. కొందాం అంటే డబ్బులు సరిపోవడం లే.. అల్లాడిపోతున్నారబ్బా సిగరెట్ ప్రియులు..