20 ఏళ్ల పచ్చని సంసారంలోకి సైకో యువతి ఎంట్రీ.. వణుకు పుట్టిస్తున్న జగపతిబాబు 'వదల'ట్రైలర్.!

20 ఏళ్ల పచ్చని సంసారంలోకి సైకో యువతి ఎంట్రీ.. వణుకు పుట్టిస్తున్న జగపతిబాబు 'వదల'ట్రైలర్.!

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'వదల'(Vadhala). ఈ సినిమాతో లయ రీఎంట్రీ ఇస్తుంది. 'టాప్ గేర్' ఫేమ్ హృతిక శ్రీనివాస్ మోస్ట్ పవర్ ఫుల్ రోల్ లో మెరవనుంది. జూలై17, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లర్, ఎమోషన్, మిస్టరీతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ట్రైలర్‌లో ఏముంది?

ట్రైలర్ ఆరంభంలో.. 20 ఏళ్ల హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. ప్రాణానికి ప్రాణమిచ్చే భార్యాభర్తలుగా జగపతిబాబు, లయ కనిపిస్తారు. కానీ, వీరి లైఫ్ లోకి పక్కింటికి వచ్చిన ఓ యువతి అడుగుపెట్టడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. జగపతిబాబు క్యారెక్టర్‌పై ఆ అమ్మాయి పెంచుకున్న పిచ్చి వ్యామోహం, అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే సైకోయిజం ట్రైలర్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మరోవైపు నీ మొగుడిని వదిలేయ్అంటూ లయకు హెచ్చరికలు రావడం కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

ఈ యువతి అసలు ఎవరు? ఆమె ఉద్దేశం ప్రేమా, ప్రతీకారమా? లేక ఆమె వెనుక మరేదైనా భయంకరమైన రహస్యం దాగి ఉందా? అనే ప్రశ్నలను ట్రైలర్ ప్రేక్షకుల ముందుంచింది. కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే వ్యక్తిగా జగపతిబాబు తన నటనతో మరోసారి ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. లయ కూడా భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న పాత్రలో సహజమైన నటన కనబరిచారు.

భారీ అంచనాలతో..

ఈ చిత్రానికి అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించారు.   ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన డార్క్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కార్తీక్ కోడకండ్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశంలో టెన్షన్‌ను మరింత పెంచుతోంది. లక్ష్మీ భూపాల రాసిన కథ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ట్రైలర్‌ను షార్ప్‌గా నిలబెట్టాయి. 

►ALSO READ | కాటుకే అక్కర్లేని ఆ కళ్ళు.. డైలాగ్ ఉంది గానీ సీన్ లేదు.. ‘పెద్ది’లోని మోస్ట్ ట్రోలింగ్ సీన్ను ఓటీటీలో లేపేసిన నెట్ఫ్లిక్స్ !

చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే అభిప్రాయం ట్రైలర్‌తోనే వ్యక్తమవుతోంది. జూలై 17న ‘వదల’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.