Allu Arjun: చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. 'జైలర్ 2'పై ఐకాన్ స్టార్ స్పెషల్ కాంప్లిమెంట్స్!

Allu Arjun: చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. 'జైలర్ 2'పై ఐకాన్ స్టార్ స్పెషల్ కాంప్లిమెంట్స్!

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్  కాంబోలో తెరకెక్కిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 549 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో రజనీ నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తలైవా స్టార్ పవర్‌కు బన్నీ ఫిదా అవుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

రజనీ స్వాగ్‌కు బన్నీ ఫిదా..

ఈ 'జైలర్ 2'లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో అలరించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ స్టార్ పవర్, స్వాగ్, ఆరాను అద్భుతంగా చూపించిన చిత్రమిదని పేర్కొన్నారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను అభివర్ణించారు.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ.. ఆయన అదరగొట్టారని కొనియాడారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత ఈ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారని పేర్కొన్నారు. దర్శకుడు నెల్సన్‌ను కూడా అభినందించారు. బన్నీ ప్రశంసలతో 'జైలర్ 2' మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

భారీ తారాగణంతో యాక్షన్ ..

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా, రిత్విక్ తమ పాత్రల్లో తిరిగి కనిపించగా.. ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖుల ప్రత్యేక పాత్రలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ALSO READ : తేజ సజ్జా కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

'రాకా'తో బిజీగా బన్నీ..

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న బన్నీ.. మరోవైపు తలైవా సినిమాను ప్రశంసించడం అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా మారింది...