Jana Nayagan Box Office: విజయ్ చివరి సినిమాకు షాకింగ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

Jana Nayagan Box Office: విజయ్ చివరి సినిమాకు షాకింగ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

భారీ హంగామా, విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జన నాయకుడు’ తొలిరోజు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ నమోదు చేసింది. అయితే, విజయ్ గత సినిమాల ఫస్ట్ డే రికార్డులను మాత్రం పూర్తిగా అందుకోలేకపోయింది. ‘జన నాయకుడు’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియా వైడ్గా రూ.48.27 కోట్ల గ్రాస్, రూ.41 కోట్ల నెట్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక విదేశాల్లో రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లతో మూవీ దూసుకెళ్తుందని తెలిపాయి.

ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం,

‘జన నాయకుడు’ తొలి రోజు ఇండియాలో రూ.48.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే మొత్తం రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అయితే, ప్రస్తుతానికి ఇవి ట్రేడ్ వర్గాలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓపెనింగ్ అంచనాలు మాత్రమే. చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అధికారికంగా కలెక్షన్ల వివరాలను ప్రకటించిన తర్వాతే వాస్తవ వసూళ్లపై పూర్తి స్పష్టత రానుంది.

భారీ ఆక్యుపెన్సీ..

‘జన నాయకుడు’ తమిళ వెర్షన్‌కు తొలి రోజు 68.31% భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు 73.85%, మధ్యాహ్నం 62.46%, సాయంత్రం 63.62%, రాత్రి షోలకు 73.31% ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం. అత్యధికంగా విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడులోనే భారీ కలెక్షన్స్ అందుకుంది. 

డే 1 కలెక్షన్స్:

వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.78.27 కోట్లు
ఇండియా గ్రాస్: రూ.48.27 కోట్లు
ఇండియా నెట్: రూ.41 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్: రూ.30 కోట్లు (సుమారు 3.2 మిలియన్ డాలర్లు)

రాష్ట్రాల వారీగా వసూళ్లు:

తమిళనాడు: రూ.24 కోట్లు (గ్రాస్)
కర్ణాటక: రూ.11.25 కోట్లు (గ్రాస్)
కేరళ: రూ.5.52 కోట్లు (గ్రాస్)
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ (తెలుగు వెర్షన్): రూ.2.75 కోట్లు (నెట్)
హిందీ వెర్షన్: రూ.1.75 కోట్లు (నెట్)

అంచనాలను ఎందుకు అందుకోలేకపోయింది?

సొంత రాష్ట్రమైన తమిళనాడులో సినిమా అద్భుతమైన స్పందనతో భారీ వసూళ్లు సాధించినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కాలేదు. ముఖ్యంగా తెలుగు, హిందీ వెర్షన్లు కలిపి రూ.4.5 కోట్ల నెట్ మాత్రమే రాబట్టాయి. తెలుగులో ఈ చిత్రం కథ 'భగవంత్ కేసరి'ని పోలి ఉందనే ప్రచారం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

►ALSO READ | Chennai Love Story Review: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎలా ఉందంటే?

అలాగే విజయ్ గత చిత్రాలైన 'లియో' (తొలి రోజు రూ.148 కోట్లకు పైగా గ్రాస్), 'ది GOAT' (రూ.100 కోట్లకు పైగా గ్రాస్) ఓపెనింగ్‌లతో పోలిస్తే, 'జన నాయకుడు' తొలి రోజు వసూళ్లు తక్కువగా నమోదయ్యాయి. దీంతో తొలి రోజే రూ.100 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ మార్క్‌ను అందుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సినిమా చేరుకోలేకపోయింది. అయితే, దళపతి విజయ్ ఫేర్‌వెల్ మూవీ కావడంతో వీకెండ్ నాటికి ఈ వసూళ్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మిక్సెడ్ టాక్.. సినిమా కథ, స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చినప్పటికీ, విజయ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రశంసలు అందుకుంటున్నాయి. యాక్షన్ సన్నివేశాలు, కొన్ని ఎలివేషన్ బ్లాక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. H. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. KVN ప్రొడక్షన్స్ దాదాపు రూ.350 కోట్లకి పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది.