Janhvi Kapoor RC16: రామ్ చరణ్‌తో జాన్వీ రొమాన్స్..బోణి కపూర్ చెప్పేసాడుగా!

Janhvi Kapoor RC16: రామ్ చరణ్‌తో జాన్వీ రొమాన్స్..బోణి కపూర్ చెప్పేసాడుగా!

జూనియర్ఎన్టీఆర్(NTR) హీరోగా వస్తున్న దేవర(Devara) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ మూవీ రెండు పార్టులుగా విడుదల రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల చేద్దామని మేకర్స్ అనుకున్పటికీ..షూటింగ్ ఆలస్యం కావడంతో దసరా కానుకగా అక్టోబర్10కి పోస్ట్ పోన్ చేశారు.

ఈ సినిమా విడుదల కాకముందే..దక్షిణాదిలో రామ్‌చరణ్‌తో (RC16) జాన్వీ మరో సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీనిని ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా స్పష్టం చేశారు. చరణ్తో సినిమా కన్ఫర్మ్‌ అయ్యిందన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అయితే జాన్వీ కపూర్‌ మాత్రం దానికి విరుద్దంగా స్పందించింది. తాను తెలుగులో దేవర మినహా మరే సినిమాను చేయడం లేదని చెప్పుకొచ్చింది. నాతో సంప్రదించకుండా ఇలాంటి విషయాలు చెప్పడం సబబు కాదని అభిప్రాయపడింది. తాను ప్రస్తుతం దేవర, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి,ఉలఝ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తాజాగా జాన్వీ చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్లో జాన్వీ రెండో సినిమాపై సందేహం నెలకొంది. ఇంతకీ రామ్ చరణ్తో ఈ బ్యూటీ సినిమా ఉంటుందా? లేదా అని ఫ్యాన్స్ నుంచి అనుమానం వ్యక్తమవుతోంది. ఇక శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. అటు బాలీవుడ్లో ఇటు సౌత్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 దేవర మూవీలో జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయి తంగం క్యారెక్టర్లో నటిస్తుంది. రీసెంట్‌‌గా జాన్వీ కపూర్ తన పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. 'ఇటీవలే తెలుగు డైలాగ్స్ నా దగ్గరికి వచ్చాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని నేర్చుకోవాలని అనుకుంటున్నా. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లిష్ మాట్లాడకుండా..కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నా' అని జాన్వీ కపూర్ తెలిపింది.