Operation Valentine: ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్పై..వరుణ్-మానుషి లవ్ వాలెంటైన్

Operation Valentine: ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్పై..వరుణ్-మానుషి లవ్ వాలెంటైన్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej)..మానుషి చిల్లర్ (Manushi Chillar) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆప‌రేష‌న్ వాలంటైన్ (Operation Valentine). ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న ఈ మూవీలో రాడార్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా హీరోయిన్ మానుషి చిల్లర్‌‌‌‌ నటించగా..పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి రుద్రగా వరుణ్ కనిపిస్తున్నాడు. 

లేటెస్ట్గా వరుణ్ -మానుషి స్పెషల్ షో కేస్ ఫిల్మ్ ఫేర్తో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్పై దర్శనమిచ్చారు. ఈ రీల్ లైఫ్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడంతో..ఆపరేషన్ లవ్ వాలెంటైన్ అనేలా ఫ్యాన్స్ను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ కవర్ పేజీలో వరుణ్ స్టైలిష్ బ్లాక్ షూట్లో కనిపించగా..మానుషి బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్లో నెటిజన్స్ను అట్రాక్ట్ చేస్తోంది.

ఇక ఆప‌రేష‌న్ వాలంటైన్ సినిమా విషయానికి వస్తే..'2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉగ్రవాదులపై తీర్చుకున్న రివెంజ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. 
రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.‘ఏం జరిగినా సరే.. చూస్కుందాం’ అంటూ దేశ గౌరవాన్ని నిలబెట్టుటకు..వరుణ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎమోషన్స్ మరియు మెయిన్గా ఆ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 

ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ముంబయిలో మకాం వేసి..వరుస ఇంటర్వ్యూలు చేస్తూ వచ్చారు.రీసెంట్గా వరుణ్ పుల్వామా ప్రాంతానికి వెళ్లి అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు కూడా అర్పించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్ వాలంటైన్ ప్రమోషన్స్తో మేకర్స్ బిజీగా ఉన్నారు.