- పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
అమీన్‌పూర్(పటాన్‌చెరు), వెలుగు: నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని, డివిజన్ పరిధిలోని పార్కుల సుందరీకరణ చేపడుతున్నట్లు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ఆల్విన్‌కాలనీ, శాంతినగర్ కాలనీల్లో పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పార్కుల అభివృద్ధికి రూ.37లక్షలు కేటాయించినట్లు చెప్పారు.
-అనంతరం వివిధ మసీదుల్లో ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుమార్‌యాదవ్, లీడర్లు విజయ్‌కుమార్, నరసింహారెడ్డి, నర్రా భిక్షపతి, అంజిరెడ్డి, షకీల్, రాజు, వెంకటేశ్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
