రూ.1100 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్స్.. RRR రికార్డ్స్ క్రాస్ చేస్తుందా?

రూ.1100 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్స్.. RRR రికార్డ్స్ క్రాస్ చేస్తుందా?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan), తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan). నయనతార(Nayanthara), దీపికా పదుకొనే(Deepika padukone), విజయ్ సేతుపతి(Vijay sethupathi), ప్రియమణి(Priyamani) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుండి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించింది ఈ సినిమా. సిల్వర్ స్క్రీన్ పై షారుఖ్ చేసిన మాస్ జాతరకు పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటంటే.. జవాన్ మూవీ విడుదలై నేటి(అక్టోబర్ 7)కి నెల రోజులు పూర్తి అయింది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.1103.27 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కేవలం ఇండియా గ్రాసే రూ.733.37 కోట్లకు పైగా ఉండగా..  ఓవర్సీస్ లో రూ.369.90 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని తెలిపారు. ఇక హిందీలో రూ. 560.03 కోట్లు, ఇతర భాషల రూ.59.89 కోట్లు వచ్చాయి. అలా మొత్తంగా ఈ సినిమా ఇండియాలో రూ.619.92 కోట్లు వసూలు చేసిందని సమాచారం.