పవన్ కళ్యాణ్తో హనీ రోజ్.. ఆ సినిమా కోసమేనా?

పవన్ కళ్యాణ్తో హనీ రోజ్.. ఆ సినిమా కోసమేనా?

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి(Veerasimhareddy) సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసింది మలయాళ బ్యూటీ హనీ రోజ్(Honey rose). సినిమాలో తన అందం, అభినయంతో ఆడియన్స్ మనసులు దోచేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో ఫుల్ బిజీ అవుతుంది ఈ బ్యూటీ అనుక్కున్నారంతా కానీ.. ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా దక్కలేదు. దీంతో మల్లి సొంత గూటికి వెళ్ళిపోయింది హనీ రోజ్. 

అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. తెలుగులో ఈ బ్యూటీ మరో అవకాశం దక్కించుకుందట. అది కూడా ఒక స్టార్ హీరో సినిమాలో. ఆ స్టార్ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan). ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో భారీ అంచనాలున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagathsingh). స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో కీ రోల్ కోసం హానీ రోజ్ తీసుకోనున్నారట మేకర్స్ కానీ.. ఏ రోల్ కోసం ఆమెను తీసుకుంటున్నారు అనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లాంటి సూపర్ హిట్ కాంబోలో వస్తున్న ఈ మూవీ.. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.