ఆస్ట్రేలియాలో జవాన్ సరికొత్త రికార్డ్.. ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు షారుఖ్

ఆస్ట్రేలియాలో జవాన్ సరికొత్త రికార్డ్.. ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు షారుఖ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan). విడుదలై 15 రోజులు గడుస్తున్నా వసూళ్ల వరద మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ.900 కోట్లు కొల్లగొట్టి ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ట్రెండ్ అనలిస్టులో ప్రకారం తవరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరనుందని సమాచారం. ఇదే గనుక నిజమైతే.. వరుసగా రెండు సినిమాలతో రూ.1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా షారుఖ్ రికార్డ్స్ క్రియేట్ చేయనున్నాడు. 

Also Read : ట్రాన్స్జెండర్ హీరోయిన్గా మొదటి సినిమా.. హీరో ఎవరో తెలుసా?

ఇది కాకుండా జవాన్ సినిమాతో మరో కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు షారుఖ్. అదేంటంటే.. ఆస్ట్రేలియాలో జవాన్ సినిమా ఏకంగా 4 మిలియన్ మార్కు ను దాటేసింది. ఇండియాన్ సినిమాలు ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు కేవలం 3 మిలియన్ వసూళ్లు మాత్రమే రాబట్టాయి. ఇప్పుడు ఆ రికార్డును షారుఖ్ తిరగరాశారు. దీంతో ఈ ఘనత సాధించిన ఒకేఒక్కడు చరిత్ర సృష్టించాడు షారుఖ్. ఈ న్యూస్ తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుచీ అవుతున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ ఇప్పటికే షారుఖాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, దీపికా పాడుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ సంస్థపై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు.