ట్రాన్స్జెండర్ హీరోయిన్గా మొదటి సినిమా.. హీరో ఎవరో తెలుసా?

ట్రాన్స్జెండర్ హీరోయిన్గా మొదటి సినిమా.. హీరో ఎవరో తెలుసా?

ఇండస్ట్రీ ఏదైనా సినిమాల విషయంలో మాత్రం ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు కూడా. మేకర్స్ కూడా ఆ వైపుగా అడుగులువేస్తున్నారు. ఒకప్పటిలాగా ఆరు పాటలు. నాలుగు ఫైట్స్ అంటే కష్టం. ఆ జమానా పోయింది. అందుకే మేకర్స్ కూడా కొత్త కొత్తవి ట్రై చేయడానికి ఇష్టపడుతున్నారు. 

తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుండి రానున్న ఈ సినిమా కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఆ సినిమా మేకర్స్. అందేంటంటే.. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ ను ఫుల్ లెన్త్ హీరోయిన్గా తీసుకొని సినిమా చేస్తున్నారు. ఆ ట్రాన్స్జెండర్ హీరోయిన్ మరెవరో కాదు వైశాలి. ఆమె హీరోయిన్ గా మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ అనే అనే సినిమా తెరకెక్కుతోంది. సుబ్రమణి హీరోగా నటిస్తున్న ఏ సినిమా.. త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. ఇక ట్రాన్స్జెండర్ హీరోయిన్గా నటిస్తుండంతో.. ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు చాలా మంది సినిమాల్లో కనిపించారు కానీ.. హీరోయిన్ గా చేయడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

Also Read : 7/జీ బృందావన కాలని రీ రిలీజ్‌ హవా.. కన్నుల బాసలు తెలియదులే సాంగ్ మైకంలో ఆడియన్స్

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మా ట్రాన్స్జెండర్స్ కు కూడా ఒక జీవితం ఉంటుంది. ట్రాన్స్జెండర్ అయితే అడుక్కోవడమేనా? నేను అలా ఉండాలనుకోలేదు. నటించాలని కలలు కన్నాను. అందుకోసం చాలా  ప్రయాత్నాలు చేసి.. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నాను.. అని వైశాలీ. చెప్పుకొచ్చారు. ఇక మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ  సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరి తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుదో చూడాలి.