7/జీ బృందావన కాలని రీ రిలీజ్‌ హవా.. కన్నుల బాసలు తెలియదులే సాంగ్ మైకంలో ఆడియన్స్

7/జీ బృందావన కాలని రీ రిలీజ్‌ హవా.. కన్నుల బాసలు తెలియదులే సాంగ్ మైకంలో ఆడియన్స్

7/జీ బృందావన కాలని (7G Brindavan Colony)తో ఆడియాన్స్కు దగ్గరయ్యాడు హీరో రవికృష్ణ (Ravi Krishna). సోనియా అగర్వాల్‌ హీరోయిన్గా నటించిన ఈ మూవీ అప్పట్లో యూత్ని తెగ ఆకట్టుకుంది. లవ్, కామెడీ, సాంగ్స్, ఎమోషన్స్ సీన్స్తో హార్ట్కు టచ్ అయ్యేలా చేశాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్‌.  సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌ అయ్యింది. 

ఇవాళ (సెప్టెంబర్‌ 22న)  4కే వెర్షన్‌లో మరోసారి ఆడియన్స్ మనసులను టచ్ చేయడానికి థియేటర్స్ లోకి వచ్చింది 7/జీ బృందావన కాలని. సుమారు 1250  పైగా షోలు ప్లాన్ చేశారు. దీంతో థియేటర్స్ లో భారీ సందడి నెలకొంది. ప్రసెంట్ థియేటర్స్ వద్ద ఆడియాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు..అనిత నేనలాంటోడ్ని కాను..అంటూ కామెంట్స్ తో సందడి చేస్తున్నారు.

Also Read : ట్రాన్స్జెండర్ హీరోయిన్గా మొదటి సినిమా.. హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నుల బాసలు తెలియదులే సాంగ్ తో ఆడియాన్స్ కేకలతో..ఈలలతో..తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీ పాటకు ఇలానే సందడి చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే సినిమా చూస్తూ ఏడ్చేస్తున్నామని ట్వీట్లు పెడుతున్నారు. 

ఈ శుక్రవారం థియేటర్లోకి పెద్ద సినిమాలు ఏవీ అంతగా లేవు. పెద్ద హీరో అంటే కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి డబ్బింగ్ రూపంలో సప్త సాగరాలు దాటి అనే మూవీ తో వచ్చాడు. అంతో ఇంతో ఈ వారం కాస్త బజ్ ఉన్న సినిమా అంటే ఇదే. ఈ మూవీ రీ రిలీజ్ వైబ్ చూస్తే.. కలెక్షన్స్ సునామీ క్రీయేట్ చేయడం కన్ఫర్మ్ అనిపిస్తోంది. 

ఇక త్వరలో 7జీ బృందావన కాలని ని తెరకెక్కించిన  డైరెక్టర్ సెల్వరాఘవన్‌ సీక్వెల్‌ను రూపొందించనున్నారు. ఇక ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ అయినట్లు సమాచారం. సీక్వెల్‌లో హీరోగా రవికృష్ణనే నటిస్తుండగా..హీరోయిన్‌గా మాత్రం అనస్వర రాజన్ (Anaswara Rajan) కనిపించనుందని.. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలైన నాటికి ఈ పేర్లు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, వీళ్ల నటనతో అందరినీ మెప్పించి సినిమా థియేటర్లకు రప్పించారు.