వందేమాతరం గీతంపై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. వందేమాతరం గీతంలోని మొదటి ఆరు చరణాలు తప్పనిసరిగా పాడాలని ఆదేశించింది. ఇకనుంచి అన్ని ప్రభుత్వం కార్యక్రమాలు, ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్లు, రాష్ట్రపతి పాల్గొన్న ప్రతి కార్యక్రమం, అన్ని స్కూళ్లలో వరిజినల్ వందమాతర గీతం నుంచి తొలగించిన చివరి నాలుగు చరణాలను కూడా కలిపి ప్లే చేయాలని తెలిపింది. తాజాగా రిలీజ్ చేసిన జీవోలో వందేమాతరం గీతం అధికారిక వెర్షన్ ను ప్రస్తావించింది. వందేమాతరం ఆలపించేసమయంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన ఆర్డర్ ప్రకారం.. వందేశాఈ గీతాన్ని 3 నిమిషాల 10 సెకన్లలో ఆలపించాలి. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవార్డులు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సి ఉంటుంది. అయితే సినిమా హాళ్లలో దీనిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. వందేమాతర గేయం పాడుతుండగా..అంతరాయం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నారు.
ఇటీవల వందేమాతరం 150 వార్షికోత్సవంలో ఈ గీతంపై చర్చనీయాంశమైంది. పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గీత రచయిత బంకించంద్ర చటర్జీ రాసిన ఒరిజనల్ గీతంలో కొన్ని చరణాలను అప్పటి నెహ్రూ ప్రభుత్వం తొలగించింది. లౌకికత్వం దెబ్బతింటుందని కారణాలతో చివరి నాలుగుచరణాలను తొలగించారు. 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గీతం నుంచి కొన్ని పంక్తులను తొలగించిందని, అదే దేశ విభజనకు బీజాలు వేసింద ని ప్రధాని మోదీ ఆరోపించడంతో ఈ చర్చ రాజకీయ దుమారం రేపింది.
