ఇథనాల్ పెట్రోల్ వల్ల దేశంలో మంచినీటి సంక్షోభం ఖాయం : కాంగ్రెస్ పార్టీ

ఇథనాల్ పెట్రోల్ వల్ల దేశంలో మంచినీటి సంక్షోభం ఖాయం : కాంగ్రెస్ పార్టీ

E20 ఇంధనం విధానం వల్ల దేశంలో మంచినీళ్లు, సాగునీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. బైక్స్, కార్లు దెబ్బతింటున్నాయని.. దీనిపై సమగ్రంగా సమీక్ష చేయాలని.. నిపుణులతో సర్వే చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2026, ఆగస్ట్ 6వ తేదీ ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో E20 ఇంధనంపై చర్చ జరిగింది. 

ఇథనాల్ ఆయిల్ నిజాలు : 

>>> ఒక లీటర్ వరి (ధాన్యం) ఇథనాల్ ఆయిల్ తయారు చేయటానికి 10 వేల 790 లీటర్ల నీళ్లు అవసరం
>>> చెరకు ఆధారిత ఒక లీటర్ ఇథనాల్ తయారీకి 3 వేల 630 లీటర్ల నీరు అవసరం. 
>>> మొక్కజొన్న ఆధారిత ఒక లీటర్ ఇథనాల్ ఆయిల్ తయారీకి 4 వేల 670 లీటర్ల నీళ్లు అవసరం. 
>>> వరి, చెరకు పంటల సాగుకు దేశంలో 70 శాతం నీటిని వాడుతున్నారు.. దీని వల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. 
>>> ఇథనాల్ డిస్టిలరీలకు బియ్యాన్ని 40 శాతం తక్కువ ధర ( సబ్సిడీ)కి కేంద్రం సరఫరా చేస్తోంది. 
>>> ఇథనాల్ E20 పెట్రోల్ వల్ల వాహనదారులపై అదనపు భారం. పాత వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయి.
>>> E20 ఇంధనం కాకుండా సాధారణ పెట్రోల్ ఎంచుకునే అవకాశం వాహనదారులకు లేకుండా చేశారు. 
>>> వాహనదారుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం. బలవంతంగా ఇథనాల్ పెట్రోల్ అమ్మకాల వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది వాహనదారుల హక్కులను కాలరాయటమే.