విద్యుత్ సెక్టార్:NPDCL లో ఏఐ సేవలు..సమస్య గుర్తింపు, పరిష్కారంలో ఉద్యోగులు, సిబ్బందికి AI సాయం

విద్యుత్ సెక్టార్:NPDCL లో ఏఐ సేవలు..సమస్య గుర్తింపు, పరిష్కారంలో ఉద్యోగులు, సిబ్బందికి AI సాయం
  • కరెంట్ ​సప్లైలో స్మార్ట్, డ్రోన్‍, డిజిటల్‍, వాట్సాప్‍...
  •  చాట్‍బాట్‍, డిజిటల్‍ టెక్నాలజీ వినియోగం
  • వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సప్లై 
  • ఏఐ సేవలకుగానూ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జాతీయ అవార్డులు

వరంగల్‍, వెలుగు: ఏఐ సేవల వినియోగంతో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(నార్తర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్​డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కంపెనీ లిమిటెడ్) మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై నాణ్యత పెరుగుదలతోపాటు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏఐ సాయంతో జాతీయ స్థాయిలో సంస్థ గుర్తింపు పొందుతోంది. 

ఉత్తర తెలంగాణలోని 18 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తోన్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్‍ అందించడంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. తద్వారా కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే నిమిషాల వ్యవధిలో స్పందించి సమస్యలను పరిష్కరిస్తోంది. 

విద్యుత్‍ సేవల్లో ఏఐ

ఎన్‍పీడీసీఎల్‍ విద్యుత్‍ సేవల్లో ఎప్పటికప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. సంస్థ పరిధిలో పంపిణీ వ్యవస్థలో విద్యుత్ అంతరాయాలను ముందస్తుగా అంచనా వేయడంలో  ఏఐ ఉపయోగపడుతోంది. 

డ్రోన్‍ సాయంతో విద్యుత్‍ ఆస్తుల పర్యవేక్షణ, జీఐఎస్‍ ఆధారిత పర్యవేక్షణ, 24 గంటల సేవల్లో భాగంగా ఏఐ వాట్సాప్‍ చాట్‍బాట్‍, ఆటోమెటిక్‍ మీటర్‍ రీడింగ్‍, సబ్‍ స్టేషన్‍ లోడింగ్‍ అనలిటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలోనూ సంస్థ ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ను ఉపయోగిస్తోంది. 

రియల్‍ టైం ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టంతో సమస్యలకు చెక్​

సంస్థ ఉద్యోగులు ప్రస్తుతం అమలు చేసే రియల్‍ టైం ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టం(ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍) విద్యుత్‍ సరఫరా వ్యవస్థలో మెరుగైన సేవలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. 33 కేవీ, 11 కేవీ లైన్లలో దాదాపు 2,500 ప్రాంతాల్లో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు (ఎఫ్‍పీఐ)ను అనుసంధానం చేయనున్నారు. వీటిద్వారా విద్యుత్‍ సేవల్లో సమస్యను గుర్తించి కంట్రోల్‍ రూములకు తెలియజేస్తుంది. 

విద్యుత్‍ సరఫరాలో అకాల వానలు, ఈదురుగాలులతోపాటు టెక్నాలజీ లోపాలతో బ్రేక్ డౌన్‍ జరిగితే మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సిబ్బందికి తెలిసి సమస్య ఎక్కడుందో కనుక్కునేందుకు ఇన్నాళ్లూ ఎక్కువ సమయం పట్టేది. ఆ తర్వాత లైన్‍ మొత్తం చెక్​చేస్తే తప్ప అసలు సమస్య ఎక్కడుందో తెలిసేది కాదు. ఈ సమస్యకు రియల్‍ టైం ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టం చెక్‍ పెడుతోంది. 


ఈ వ్యవస్థను ఎన్‍పీడీసీఎల్​అధికారులు మొదట 5 సబ్‍స్టేషన్లలో ప్రయోగత్మకంగా అమలు చేశారు. అక్కడినుంచి ఎఫ్‍పీఐలు స్కాడాకు పంపిన సమాచారం ఆధారంగా మెరుగైన సేవలను పరిశీలించారు. అనంతరం అందుబాటులో ఉన్న మిగతా 133 సబ్‍స్టేషన్లకు సైతం అనుసంధానం చేశారు. 

సంస్థకు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 జాతీయ అవార్డులు

ఎన్పీడీసీఎల్‍ ఏఐ సేవల వినియోగంతో రెండు జాతీయ స్థాయి అవార్డులు అందుకుంది. ‘టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్పెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆధ్వర్యంలో బెంగుళూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈనెల 9న నిర్వహించిన సౌత్‍ ఇండియా పీఎస్యూ అండ్‍ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు అందుకుంది. సంస్థ తరఫున సెక్రటరీ వెంకటేశం అవార్డు అందుకున్నారు.

 ‘ది ఎకనామిక్స్ టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆధ్వర్యంలో 10న జరిగిన మరో కార్యక్రమంలో ‘అడాప్టింగ్‍ ఏఐ ఇన్ ఎనర్జీ’ అవార్డును సీఈ సురేందర్‍ అందుకున్నారు. నెట్‍వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తృతి, మౌలిక వసతుల విస్తరణ, ఇంటర్‍ లింకింగ్‍ లైన్లు, విపత్తు సన్నద్దత ప్రణాళిక, కవర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండక్టర్‍ పనులు, ఫీడర్‍ అవుటెజ్‍ ప్రిడిక్షన్‍ మోడల్‍, భద్రత, సోలార్‍ విద్యుత్‍ ప్రొత్సాహం, డిజిటల్‍ టెక్నాలజీలో చూపిన ప్రతిభకు ఈ అవార్డులు అందాయి. 

ఈ సందర్భంగా ఇటీవల హనుమకొండ విద్యుత్‍ భవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు అవార్డులను సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్‍రెడ్డికి అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్‍, సి.ప్రభాకర్‍, సీఈ సురేందర్‍, సీఎస్‍ వెంకటేశం పాల్గొన్నారు.

ఏఐ సేవలతో జాతీయస్థాయి గుర్తింపు 

ఎన్పీడీసీఎల్‍ పరిధిలో విద్యుత్‍ పంపిణీకి ఏఐ సేవలను వినియోగిస్తున్నాం. తద్వారా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోంది. దీంతో టెక్నికల్​ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజిటల్‍ పరివర్తనలో ముందంజలో ఉన్న సంస్థగా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది సమష్టి కృషితో అవార్డులు సాధించాం. నాణ్యమైన, మెరుగైన సేవల కోసం భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీని మరింత అందుబాటులోకి తెస్తాం. 


- కర్నాటి వరుణ్‍రెడ్డి, సీఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్​-