మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గత ఐదు రోజులుగా పోలీసుల భద్రత మధ్య కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఐదు రోజులకు గాను 788 హుండీలను లెక్కించగా.. రూ. 11 కోట్ల 83 లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు అధికారులు. హుండీలలో కాసులపేరు వచ్చిన సంగతి తెలిసిందే.. భక్తులు సమర్పించిన కాసులపేరు బంగారం కాదని తేల్చారు సిబ్బంది.
హుండీలో నకిలీ బంగారు వెండి వస్తువులు రావడం సహజమని.. ధరలు విపరీతంగా పెరిగిన బంగారం కొనే స్తొమత లేక.. అమ్మవార్లకు మొక్కుకొని ఇలా నకిలీ వస్తువులు సమర్పిస్తుంటారని అంటున్నారు అధికారులు.
బంగారం మాత్రమే కాకుండా వెండి వస్తువులు కూడా ఇలా నకిలీవి సమర్పిస్తుంటారని అంటున్నారు సిబ్బంది. ఇదిలా ఉండగా.. హుండీలో లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం 163 హుండీలను తెరువగా రూ. 1.12 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలిపారు అధికారులు.
►ALSO READ | కోరుట్లలో BRS అభ్యర్థి ఇంట్లో దేవుడి వెండి వస్తువులు : ఓటర్లకు ఈ రేంజ్ లో పంపకాలా..!
ఇప్పటివరకు మొత్తం 788 హుండీలను ఓపెన్ చేయగా.. రూ.11,83,85,116 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. జాతరలో మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర పూర్తయ్యాక తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన 40 హుండీలు సైతం లెక్కించాల్సి ఉంది.
