ప్రామిస్ అనేది రాతపూర్వక వీలునామా కాదు. వట్టి మాటలు ఇచ్చి పుచ్చుకోవడం.. వాటిని మాటలకే పరిమితం చెయ్యటం అంతకన్నా కాదు. రెండు మనసులు ఒకే నిర్ణయానికి రావడం ప్రామిస్. ఆ నిర్ణయానికి కట్టుబడి కష్ట సుఖాల్లో జీవితాంతం కలిసి నడవడం డబుల్ ప్రామిస్. వాలెంటైన్ వీక్ లో ఈ రోజు ప్రామిస్ డే. మరి మీరు ఏ ప్రామిస్ చేస్తారు?
ప్రేమ పుట్టినప్పుడే ఈ ప్రామిస్ పుట్టింది. ప్రేమ శరీరం అయితే, ప్రామిస్ ప్రాణం ప్రేమకథ అయినా. వేరే అనుబంధమైనా ప్రామిస్ తోనే పరిపూర్ణం అవుతుంది. కలకాలం కష్టాలని, కన్నీళ్లని కలిసి ఎదుర్కోవాలని, సుఖాలని జ్ఞాపకాలని కలిసి పంచుకోవాలని ప్రామిస్ బోధిస్తుంది. పెళ్లి వరకు నడిపించి.. బంధాలను నిర్మిస్తుంది. పెళ్లిలో ధర్మేచ, అర్దేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి'అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే ధర్మంలో సంపదల విషయంలో, శారీరక సుఖాల్లో, దాన ధర్మాల వల్ల వచ్చే మోక్షాలో నిన్ను విడిచి నడువను అని వధువును స్వీకరించేటప్పుడు ప్రామిస్ చేస్తాడు.
జీవితాంతం ఇలాగే కలిసి నడుస్తామని అగ్ని సాక్షిగా ఇద్దరూ ప్రామిస్ చేస్తారు. పెళ్లినాటి ప్రామిస్ లను మాటలకే పరిమితం చెయ్యకుండా అనుసరించి ఆదరించిన నాడే అది పవిత్ర బంధంగా మారుతుంది. ఒకరి మాట ఒకరు. గౌరవించుకోకుండా చేసిన ప్రామిస్ లన్నీ నిలబెట్టుకోని జీవితాలు తీరం చేరకుండానే మునిగిపోతాయి.
పాజిబుల్ ప్రామిస్...
నీ కోసం చందమామని తీసుకొస్తా ... నక్ష త్రాలని తెచ్చి నీపై కుమ్మరిస్తా'వంటి సాధ్యం కాని ప్రామిస్ లు చేస్తే లాభం లేదు కొంచెం సాధ్యమయ్యే ప్రామిస్ లు చేస్తే బాగుంటుంది. కుదిరినప్పుడల్లా గార్డెన్ లో కూర్చొని కలిసి చందమామని చూద్దాం. చుక్కలకు కబురు చెబుతాం అని ప్రామిస్ చెయ్యండి. నగలు చేయిస్తా మేడలు కట్టిస్తా అనటానికి ముందు ఇకపై నేను సిగరెట్ తాగను. మందు కొట్టను' అని ప్రామిస్ చెయ్యండి. ఆచరించినిలబెట్టుకోండి. అప్పుడు మీ పాన్ట్నర్ లోకంలో అందరికన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతారు.
►ALSO READ | మహా శివరాత్రి : శక్తివంతమైన శివ తాండవ స్తోత్రం చదవండి.. వినండీ.. మీకు తెలియని ఎనర్జీ వస్తుంది..!
'ఎన్నో జన్మల బంధం మనది. ఎన్ని జన్నలైనా నీతోనే నా జీవితం! అని అనడానికి ముందు ఈ జన్మను పట్టించుకోండి. 'డ్రైవింగ్ లో ఉన్న ప్పుడు సీటు బెల్టు పెట్టుకుంట, సెల్ ఫోన్ మాట్లా డుతూ డ్రైవ్ చెయ్యను హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కను అని ప్రామిస్ చెయ్యండి.
రోజూ కలిసి వంట చేసుకుందాం, డైలీ మార్నింగ్ వాకింగ్ కు వెళ్లాం. నెలకోసారైనా కలిసి సినిమాకు పోదాం... అబద్దాలు చెప్పను..రహస్యాలు దాచను' అని చేతిలో చెయ్యేసి చెప్పండి చాలు. ఇవి చిన్న ప్రామిస్ గా కనిపిస్తున్నా. ఇంతకు మించి మీ పార్ట్నర్ ఏం ఆశిస్తారు? ఆనందంగా ఉండటానికి ఇంకేం కావాలి? ప్రేమ కేరింగ్ని మించిన ఆస్తులేం ఉంటాయి?
