మహా శివరాత్రి : శక్తివంతమైన శివ తాండవ స్తోత్రం చదవండి.. వినండీ.. మీకు తెలియని ఎనర్జీ వస్తుంది..!

మహా శివరాత్రి : శక్తివంతమైన శివ తాండవ స్తోత్రం చదవండి.. వినండీ.. మీకు తెలియని ఎనర్జీ వస్తుంది..!

ప్రతి ఏటా మహాశివరాత్రి మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. ఆ రోజు శివపార్వతులను భక్తిశ్రద్ధలతో ఆరాధించి శివ తాండవ స్తోత్రం చదివితే  శుభ ఫలితాలు కలుగుతాయని కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈస్త్రోత్రాన్ని ఎవరు రచించారు.. ఎప్పుడు చదవాలి..  దీనిని పఠించడం వలన ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఈస్టోరీలో తెలుసుకుందాం. . .!  

శివుడికి సంబంధించిన ఎన్నో పురాణాలు ఉన్నా, అన్నింటిలోకీ శశివ తాండవ స్తోత్రం  చాలా ప్రామాణికమైందని పండితులు చెబుతున్నారు. దీనిని పఠించడం వలన రకరకాల కోరికలు నెరవేరుతాయని శివపురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు.. దీనిని విన్నా చదివినా.. తెలియకుండా పాజిటివ్​ ఎనర్జీ వస్తుందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ స్తోత్రాన్ని  మహాశివరాత్రి (2026, ఫిబ్రవరి 15, ఆదివారం)  తెల్లవారు జామున.. సాయం కాలం సమయంలో.. అలాగే లింగోద్భవ సమయంలో అంటే మహాశివరాత్రి రోజున కళ్యాణం అయిన తరువాత .. అర్దరాత్రి 12 గంటలకు చదివితే మరింత శుభ ఫలితం దక్కుతుంది. 

శివ తాండవ స్తోత్రం రావణాసురుడు రచించిన అత్యంత శక్తివంతమైన .. ఉద్వేగభరితమైన శివ స్తోత్రం. ఇది పరమశివుని నాట్య విలాసాలను, జటాజూటాన్ని, గంగాధర రూపాన్ని ..  శక్తులను వర్ణిస్తుంది. ఈ స్తోత్రం పరమేశ్వరుని వివిధ రూపాల్లో రుద్ర తాండవ రూపాలను కీర్తిస్తూ, భక్తులలో భక్తి భావాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. 

శివ తాండవ  పవిత్ర శ్లోకాన్ని రెండు విభాగాలుగా విభజించారు.  మొదటి విభాగం  శివుడిని స్తుతించడం ..  రెండవ భాగం శివుడిని ప్రార్థించడం ..  తెలిసీ తెలియక చేసిన తప్పుల నుంచి క్షమాపణలు కోరే అంశాలున్నాయి. 

శివ తాండవ స్తోత్రం ప్రాముఖ్యత 

దీనిని అనేక సార్లు జపం చేయడం వలర మనస్సునకు ప్రశాంతత కలుగుతుంది.  ఈ శ్లోకం చాలా పవిత్రమైనది.. శక్తివంతమైనది. దీనిని రోజు పఠించిన వారికి శివుని ఆశీర్వాదంకలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి సోమవారం.. ప్రదోషకాలంలో.. ( సాయంత్రం సమయంలో)  ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని జపించడం  ఎంతో పుణ్యప్రదమని చెబుతున్నారు. 

 ప్రతికూల శక్తి తొలగుతుంది:   శివతాండవ స్తోత్రాన్ని మహాశివరాత్రి రోజు చదవడం వలన వ్యక్తిగత జీవితంలో ప్రతికూల శక్తి వలన ఇబ్బందులు పడుతుంటే  తొలగిపోతాయి. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది.  ఎలాంటి ఆందోళన ఉండదు.  జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంచి ఆలోచలనలు వస్తాయని పండితులు చెబుతున్నారు. 

కాల సర్ప దోష నివారణ:  జాతకంలో కాలసర్పదోషం ఉంటే చాలా ఇబ్బందులు పడతారు.  ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతాయి.  పెళ్లి.. సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి.  ఉద్యోగంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.  కాలసర్ప దోష నివారణకు మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఎదుట శివతాండవ స్తోత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు.  

పరమేశ్వరుని దగ్గర క్షమాపణలు కోరడం:  జీవితంలో తెలిసీ.. తెలియక చేసిన పొరపాట్లు వలన అనేక సమస్యలు ఎదుర్కొంటారు.  ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకపోయినా .. అన్ని రకాల పరిహారాలు పాటిస్తున్నా ఎందుకు సమస్యలు వస్తున్నాయో కూడా అర్దం కావు.. ఇలా ఇబ్బంది పడే వారు గత జన్మలో చేసిన పాప కర్మల వలన ఈ జన్మలో ఇబ్బందులు పడతారని పండితులు చెబుతున్నారు.  ఇలాంటి వారు మహాశివరాత్రి రోజున శివుని విగ్రహం ఎదుట .. మోకాళ్లపై కూర్చొని శివతాండవ స్త్రోత్రాన్ని పఠిస్తే ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | ఆధ్యాత్మికం : ఫిబ్రవరి 13న విజయ ఏకాదశి.. అప్పులు ఉన్నోళ్లు.. ఉద్యోగ సమస్యలకు ఈ పూజ చేయండి..!

మరణ భయం: జీవితంలో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కొంతమంది చాలా సార్లు ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి ఇక బతకమేమో అని భయపడుతుంటారు.  అకాల మరణం ఎప్పుడువస్తుందోనని భయపడుతుంటారు. ఇలాంటివారు అపమృత్యు భయాన్ని తొలగించుకొనేందుకు శివ తాండవ స్తోత్రాన్ని చదవాలని పండితులు అంటున్నారు. 

చంద్రుని ప్రతికూల ప్రభావం: జాతకంలో చంద్రుడు దృష్టి మంచిగా లేకపోతే ప్రతి విషయంలో కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఎవరిని నమ్మలేరు.  అలా ఎందుకుంటారో వారికి కూడా అర్దం కాదు. చంద్రుని వక్ర దృష్టి వలన కలిగే ప్రభావాలను తొలగాలంటే శివతాండవ  స్తోత్రాన్ని పఠించి శివుని ఆశీర్వాదం పొందాలని పండితులు చెబుతున్నారు.

శివ తాండవ స్తోత్రం తెలుగులో 

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ॥ 6 ॥

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే ।
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ॥ 7 ॥

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః ।
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ॥ 8 ॥

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ ।
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥ 9 ॥

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ ।
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥ 10 ॥

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ ।
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ॥ 11 ॥

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః ।
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ॥ 12 ॥

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ॥ 13 ॥

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ ।
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥ 14 ॥

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ॥ 15 ॥

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.