కేరళ రాష్ట్రం విద్యారంగంలో మరో చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొదటిసారిగా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు కేరళలో ఇంటర్ (12th) వరకే ఉచిత విద్య ఉండేది. ఇకపై ప్రభుత్వ & ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో చేరే ఆర్ట్స్ & సైన్స్ విద్యార్థులందరికీ ఉచితంగా విద్యను అందించాలని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ బడ్జెట్‌లో ప్రకటించారు.
విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే అత్యాధునిక సాంకేతికత, స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పేలా ఒక గ్లోబల్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నారు.
వేరే స్కాలర్‌షిప్‌లు లేని ఫుల్ టైం పీహెచ్‌డీ (Ph.D) విద్యార్థులకు నెలకు రూ.15 వేలు గ్రాంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం దాదాపు రూ.38.76 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థుల వసతి సౌకర్యాల కోసం ఎర్నాకుళం, త్రిస్సూర్, కోజికోడ్‌లో మొదటి దశలో కొత్త పబ్లిక్ హాస్టళ్లను నిర్మించనున్నారు.
►ALSO READ | AI కంటెంట్‌పై కేంద్రం కొత్త రూల్స్ ! డీప్‌ఫేక్ వీడియోలు/ఫోటోలు 3 గంటల్లోనే మటాష్!
రాష్ట్రం నుండి విద్యార్థులు చదువు కోసం బయటకు వెళ్లడం వల్ల ఏటా దాదాపు రూ.8,000 కోట్లు బయటకు పోతున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఆ డబ్బును రాష్ట్రంలోనే ఉంచడంతో పాటు, అందరికీ నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
