AI కంటెంట్‌పై కేంద్రం కొత్త రూల్స్ ! డీప్‌ఫేక్ వీడియోలు/ఫోటోలు 3 గంటల్లోనే మటాష్!

 AI కంటెంట్‌పై కేంద్రం కొత్త రూల్స్ !  డీప్‌ఫేక్ వీడియోలు/ఫోటోలు 3 గంటల్లోనే మటాష్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేసే డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు సమాజానికి ముప్పుగా మారుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలు  facebook, Instagram, X, YouTube మొదలైన వాటికీ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై ఏదైనా ఫోటో లేదా వీడియోను AI సాయంతో క్రియేట్ చేస్తే, అది AI ద్వారా క్రేయేట్ చేసిందని స్పష్టంగా కనిపించేలా 'లేబుల్' వేయాలి. దీనివల్ల అది నిజమైనదా లేక కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసిందా అనేది ప్రజలకు ఈజీగా తెలుస్తుంది. ఒకసారి AI లేబుల్ వేసిన తర్వాత, దాన్ని సోషల్ మీడియా సంస్థలు గానీ,  కంటెంట్ క్రియేటర్స్, ఇతరులు గానీ తొలగించడానికి వీల్లేదు.

 ప్రభుత్వం లేదా కోర్టులు ఏదైనా AI కంటెంట్‌  తప్పుడుగా లేదా ఫేక్ అని గుర్తించి సమాచారం ఇస్తే  కేవలం 3 గంటల్లోపు ఆ వీడియో లేదా ఫోటోను సోషల్ మీడియా నుండి తీసేయాలి. అశ్లీలత, పిల్లలకు హాని కలిగించేవి లేదా మోసపూరితమైన AI కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా కనిపెట్టి అడ్డుకొనే టెక్నాలజీని  సోషల్ మీడియా సంస్థలు ఏర్పాటు చేయాలి.

ఈ రూల్స్ ఎప్పటి నుండి: 
ఈ కొత్త రూల్స్ 20, ఫిబ్రవరి  2026 నుండి అమల్లోకి వస్తాయి. ఎందుకంటే నిజం ఏదో, అబద్ధం ఏదో తెలియకుండా ప్రజలను మోసం చేస్తున్న 'డీప్‌ఫేక్' వీడియోలు, ఫోటోలు అరికట్టడమే ప్రభుత్వ ముఖ్య  ఉద్దేశం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వచ్చే తప్పుడు ప్రచారాలు, అసభ్యకరమైన వీడియోల నుండి సామాన్యులకు రక్షణ కల్పించడానికి ఈ చర్యలు తీసుకున్నారు.