సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 14న సినిమా విడుదల కానుంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘నాకు సక్సెస్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు నాలో కూడా డౌట్స్ ఉండేవి. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఇదే యాప్ట్ టైటిల్ అనిపిస్తుంది. శివ పాత్రలో నేను, మిత్ర క్యారెక్టర్‌లో మానస కనిపిస్తుంది. వీరి జర్నీ చాలా ఇంటరెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. మంచి పాజిటివ్ వైబ్‌తో వస్తోన్న ఈ సినిమా కచ్చితంగా మాకు సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నాడు. మానస వారణాసి మాట్లాడుతూ ‘ట్రైలర్ రిలీజ్ అయినప్పట్నుంచీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమా సక్సెస్‌పైనా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పింది.
ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘ఇదొక ప్యూర్ లవ్‌స్టోరీ. అలాగే ఫ్యామిలీ నేపథ్యంలో సాగే చక్కటి ఎంటర్‌టైనర్. హీరో హీరోయిన్ పాత్రల్లో మంచి ఎమోషన్ ఉంటుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. కంటెంట్‌పై నమ్మకంతో గురువారం చెన్నైతో పాటు హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, విజయవాడలో ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే 14న మూవీ రిలీజ్ అయినప్పటికీ 13న సాయంత్రం నుంచే అన్ని థియేటర్స్‌లో షోస్ వేస్తున్నాం’ అని చెప్పారు.
