ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వివో రెండు కొత్త మోడల్ 5జి ఫోన్స్ తీసుకురాబోతుంది. అయితే వీటికి సంబంధించి లాంచ్ వివరాలు కొంతకాలంగా స్పష్టంగా లేనప్పటికీ ఎట్టకేలకు వివో V70, వివో V70 Elite లాంచ్ తేదీని వెల్లడించారు. ఈ రెండు ఫోన్‌లు ఫిబ్రవరి 19న విడుదల కానున్నాయి. కాంపాక్ట్ సైజు, పంచ్-హోల్ డిస్ ప్లే, చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌లో మంచి కలర్స్ అప్షన్స్ లో రాబోతుంది, వీటిలో లెమన్ ఎల్లో వేరియంట్ కూడా ఉంది.
లాంచ్ వివరాలు
వివో V70, వివో V70 Elite రెండూ ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతాయి. లాంచ్ తర్వాత ఈకామర్స్ సైట్‌లో, Vivo ఇండియా సైట్ ఇంకా రిటైల్ స్టోర్‌లలో లభించే అవకాశం ఉంది. లెమన్ ఎల్లో కలర్ ఆప్షన్ తో సాండ్ బీజ్, అథెంటిక్ బ్లాక్, పాషన్ రెడ్ వంటి కలర్ ఆప్షన్ ఉన్నాయి.
వివో V70, వివో V70 ఎలైట్ ధర
సమాచారం ప్రకారం, Vivo V70 ప్రారంభ ధర 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌కు రూ. 45,999, Vivo V70 Elite ధర రూ. 51,999 గా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన ధరలు ఫిబ్రవరి 19న జరిగే లాంచ్ కార్యక్రమంలో వెల్లడిస్తారు.
స్పెసిఫికేషన్లు
వీటిలో 50-మెగాపిక్సెల్ ZEISS టెలిఫోటో కెమెరా, జూమ్ క్లారిటీతో 4k 60fps వీడియో, AI ఫ్లోరల్ బ్లెస్సింగ్ ఎడిటింగ్ టూల్ మెటల్ ఫ్రేమ్ ఉన్నాయి. Vivo V70 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల పూర్తి HD+ AMOLED ప్యానెల్ ఉంటుందని, దీనిలో Qualcomm Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. Vivo V70లో Zeiss ఆప్టిక్స్ తో ట్రిపుల్ రియర్ సెటప్ ఉండే అవకాశం ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, ముందు అల్ట్రా-వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50-మెగాపిక్సెల్ కెమెరా చూడొచ్చు.
90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ, ఇతర ఫీచర్స్ లో IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, 4 సంవత్సరాల వరకు OS అప్ డేట్స్ తో లేటెస్ట్ OriginOS, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయి. Vivo V70 లాగానే Vivo V70 Eliteలో కూడా అదే డిస్ ప్లే, కెమెరా, బ్యాటరీ, ఉంటుందని సమాచారం. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్ దీనిలో ఉండొచ్చని తెలుస్తోంది.
