సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. ప్రైవేట్ స్కూల్ భవనంలో చెలరేగిన మంటలు

సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. ప్రైవేట్ స్కూల్ భవనంలో చెలరేగిన మంటలు

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  పోతిరెడ్డి పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి.  చూస్తుండగానే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని శ్రద్ధ ప్రైవేట్ స్కూల్ భవనంలో బుధవారం (ఫిబ్రవరి11) మధ్యాహ్నం  అగ్నిప్రమాదం జరిగింది.జీ ప్లస్ 3  అంతస్తు ల భనవంలో గ్రౌండ్ ఫ్లోర్ మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు మిగతా మిగతా మూడు ఫ్లోర్లకు అంటుకున్నాయి. దట్టమైన పొగలు పెద్ద ఎత్తు మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. మంటల్లో భవనం మొత్తం తగలబడిపోయింది. ఈ ఘటనతో స్థానికులు పరుగులు  పెట్టారు.  

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉన్నందున స్కూల్ కు సెలవు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకున్నట్లు అధికారులు  అనుమానిస్తున్నారు.