Jr NTR 31: ఎన్టీఆర్ 31లో కాంతారా రిషబ్ శెట్టి!..ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటీ?

Jr NTR 31: ఎన్టీఆర్ 31లో కాంతారా రిషబ్ శెట్టి!..ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటీ?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Jr NTR) తన 30వ సినిమా దేవరను డైరెక్టర్ కొరటాల శివ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా 80 శాతం పూర్తి చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ తన 31వ సినిమాకు సంబంధించి కసరత్తులు మొదలు పెట్టేశాడు. అందుకోసం తన బాడీని పూర్తిగా మార్చేశాడు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తన 31 సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ విభిన్నమైన రీతిలో కపించడానికి రెడీ అయ్యారని తాజా ఫొటోస్తో విషయం బయటకి వచ్చింది. 

లేటెస్ట్గా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వెళ్లారు.ఈ సందర్బంగా కాంతారా హీరో రిషబ్ శెట్టి అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో..ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ 31 వ సినిమా కోసం బరువు బాగా తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ సందర్బంగా ప్రశాంత్ నీల్..ఎన్టీఆర్ ‘NTR31’సినిమా ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా భిన్నమైన ఎమోషన్స్ తో కొనసాగుతుందని..యాక్షన్ స్టోరీ కాదని..కొత్త స్టోరీతో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే..తాజాగా ఎన్టీఆర్ 'బెంగళూరు డైరీస్' అంటూ షేర్ చేసిన ఫొటోస్ ను బట్టి..ఈ మూవీలో కాంతారా రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. కాంతారా రిషబ్ శెట్టి+ఎన్టీఆర్+సినిమా= బ్లాక్ బస్టర్" అంటూ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు.మరికొందరు 'ఫ్రేమ్ విత్ ఫుల్లీ ఫేవ్స్' అంటూ తెలుపుతున్నారు.

అలాగే వీరితో పాటుగా స్టార్ ప్రొడక్షన్ హౌస్ అయిన టాలీవుడ్ మైత్రి మేకర్స్ లో ఒకరైన రవి అండ్ KGF నిర్మాత విజయ్ కిర్గందూర్‌లు ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ని వీరు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)