జ్యోతిష్యం: జూన్ నెలలో గురుడు ..శుక్రుడు కలిసి సంచారం.. కర్కాటక రాశి వారికి రాజయోగం..

జ్యోతిష్యం: జూన్ నెలలో గురుడు ..శుక్రుడు కలిసి సంచారం.. కర్కాటక రాశి వారికి రాజయోగం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో వివిధ రకాల రాజయోగాలు ఉంటాయి. ప్రతి రాజయోగానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని యోగాలు శుభప్రదమైనవి. అవి జీవితంలోని కష్టాలను తగ్గిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. జూన్ నెలలో  గురుడు, శుక్రుడు  గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల కర్కాటక రాశి వారికి  అదృష్టం, ధనం, వృత్తిపరమైన శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు .. 

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

ఈ రాశిలో గురువుతో పాటు, శుక్రుడు సంచరించడండం వలన.. కుజుడు, సూర్యుడు, బుధుడు అనుకూలత వల్ల నెలంతా విజయాలతో సాగిపోతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులన్నీ సునాయాసంగా పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. 

శని భాగ్య స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. సమాజంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. 

గురుడు.. సూర్యుడు కలిసి రాజయోగాన్ని ఏర్పరచుకోవడం వలన ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది.  అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది.  వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు.  కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.  విదేశీ వ్యాపారాలు కలసి వస్తాయి. 

►ALSO READ | జ్యోతిష్యం: జూన్ (2026) లో గ్రహా మార్పు.. మిథునరాశి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టే ఛాన్స్..!

ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో  మీరే చక్రం తిప్పే అవకాశం ఉంది.  ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారికి బంధువర్గంలోని వారితో కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

రాజకీయాల్లో ఉన్నవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, బంధు మిత్రులలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.