జ్యోతిష్యం: జూన్ (2026) లో గ్రహా మార్పు.. మిథునరాశి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టే ఛాన్స్..!

జ్యోతిష్యం:  జూన్ (2026) లో గ్రహా మార్పు.. మిథునరాశి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టే ఛాన్స్..!

జ్యోతిష్యం ప్రకారం 2026 జూన్​ నెల మిథున రాశి వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఈ నెలలో భారీగా గ్రహాలు మారనునన్నాయి.  దీని ప్రభావం వలన ఈ నెల ( జూన్​ 2026) మిథున రాశివారికి ఎలా ఉంటుంది.. ఆర్థిక స్థితిగతులపై గ్రహాల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది.. సుఖ సంతోషాలు ఎలాఉంటాయి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు ..

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

 

ఈ నెలంతా (జూన్​ 2026) మిథున రాశి వారికి  సానుకూలంగా గడిచిపోతుంది.  ధన స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఈ నెలలో గ్రహాల సంచారం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది.  

రాజయోగం ఏర్పడటం వలన  మిథున రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని పండితులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. . మీరు పడే శ్రమకు అదృష్టం కూడా తోడై లాభాలను తెచ్చిపెడుతుంది.అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. 

►ALSO READ | జ్యోతిష్యం: జూన్ నెల చాలా ఇంపార్టెంట్.. శక్తివంతమైన గ్రహాల మార్పు.. వృషభ రాశి వారి ఫలితాలు ఇవే..!

విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. .

ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.