జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది (2026) జూన్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో శక్తివంతమైన గ్రహాలు వాటి స్థానాలు మారనున్నాయి. గురుడు, సూర్యుడు, శుక్రుడితో పాటు మరో రెండు గ్రహాలు మారడం వలన వృషభరాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
జూన్ నెల (2026) గ్రహాల మార్పు వివరాలు .. వృషభరాశి ఫలితాలు
- జూన్ 2: గురుడు కర్కాటకరాశిలోకి
- జూన్ 8: కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు
- జూన్ 13: శుక్రుడు సింహరాశిలోకి
- జూన్ 15న: సూర్యుడు మిథునరాశిలోకి
- జూన్ 21 : కుజుడు వృషభ రాశిలోకి
- జూన్ 22: కర్కాటకరాశిలోకి బుధుడు
- జూన్ 29 : కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు
రాశ్యధిపతి శుక్రుడికి తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి కలుగుతున్నందువల్ల ఈ నెలంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. లాభ స్థానంలో ఉన్న శని వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడుతుంది. పదోన్నతి, జీతం పెరుగుదల వంటి అవకాశాలు కనిపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు
వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తగ్గి, నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య నిపునులు అంటున్నారు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొనడంతో పాటు వివాహం, సంతానం సంబంధిత ఆందోళనలు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది. తృతీయ స్థానం బలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు.
►ALSO READ | జ్యోతిష్యం: జూన్ నెలలో గురుడు.. శుక్రుడు కలిసి సంచారం.. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది..!
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం జరిగే బలమైన సూచనలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఈ నెల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.ఈరాశి వారు ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవి పూజ చేయడం, పేదలకు పాలు లేదా తెల్లటి మిఠాయిలను దానం చేయడం వల్ల అదృష్టం మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం, ఆర్థిక, వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి జీవితం నిలకడగా ముందుకు సాగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈ నెల మీకు గోల్డెన్ పీరియడ్' లాంటిది. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. పిల్లలకు శ్రమ పెరుగుతుంది.స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది.ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
