Kannappa: ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు.. తెలుగు వెర్షన్ అంచనా ఎంతంటే?

Kannappa: ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు.. తెలుగు వెర్షన్ అంచనా ఎంతంటే?

మంచు విష్ణు నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’(Kannappa).ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజై సినిమాపై అంచనాలు పెంచేశాయి.

సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో కన్నప్ప తెరకెక్కించారు మేకర్స్. సినిమా రిలీజ్కు ఇంకా 3 రోజులే మిగిలుంది. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ సైతం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కన్నప్ప ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి.

అందుకు బలమైన కారణం ప్రభాస్ ఒక్కరే.! ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇదే మాట హీరో విష్ణు కూడా ఒప్పుకుంటాడు. కానీ, కన్నప్ప ప్రమోషన్స్లో ప్రభాస్ వినిపిస్తుండే తప్ప.. ఎక్కడ కనిపించట్లేదు. నిజానికి ప్రభాస్ ఒక్క ఈవెంట్లో దర్శనమిచ్చినా.. అభిమానుల్లో జోష్ వేరే లెవల్లో ఉంటది. మరి విష్ణు ఏమైనా ప్లాన్ చేశాడా? లేదా ప్రభాస్ వేరే మూవీ షూటింగ్స్తో బిజీగా ఉన్నడా? అనేది తెలియాల్సి ఉంది. 

కన్నప్ప ఓపెనింగ్ డే టార్గెట్:

కన్నప్ప ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారట మేకర్స్. ఇండియాలో, తెలుగు వెర్షన్ రూ.16 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, హిందీ వెర్షన్ IMDbప్రకారం తొలి రోజు రూ.4 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా 5,400+ స్క్రీన్లలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ గా 4,300కి పైగా ప్రదేశాలలో, అన్ని ప్రధాన ప్రీమియం ఫార్మాట్‌లతో సహా, మరియు విదేశాలలో 1,100కి పైగా ప్రదేశాలలో స్క్రీనింగ్ కి తీసుకొస్తున్నారు. USలో 200+ ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఈ లెక్కన కన్నప్ప సినిమాకు తొలిరోజు రాక్ బాగుంటే.. రికార్డు బద్దలుకొట్టే ఛాన్స్ ఉంది. 

BookMyShow, PayTM మూవీస్, Fandango మరియు Atom Tickets,డిస్ట్రిక్ యాప్ వంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కన్నప్ప సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్.

కన్నప్ప ఓటీటీ:

కన్నప్ప ఓటీటీ డీల్పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ రోజుల్లో, థియేటర్లలో సినిమాల విడుదల తేదీలను, నిర్ణయించడంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటిది, కన్నప్ప రిలీజ్కు దగ్గరపడిన, ఇప్పటివరకు ఓటీటీ డీల్ సెట్ అవ్వలేదు.

ఈ మూవీ కోసం రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీలో ఉన్నాయని సమాచారం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్.. కన్నప్ప డిజిటల్ హక్కుల కోసం భారీ రేట్ చెల్లించేందుకు సిద్దమయ్యాయట. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో.. విష్ణు పలు కండీషన్లు పెట్టారని సినీ వర్గాల టాక్. విష్ణు పెట్టిన కండిషన్స్తో.. ఈ ఓటీటీలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఓటీటీ సంస్థలు ఆఫర్ చేసిన అమౌంట్ విష్ణుకు నచ్చలేదు. దాంతో విడుదల తర్వాతనే సినిమా డిజిటల్, టీవీ రైట్స్ అమ్మాలని డిసైడ్ అయ్యారు. అలాగే సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరికీ ఇవ్వలేదు. మెజారిటీ ఏరియాలలో ఆయన సొంతంగా విడుదల చేస్తున్నారు. కమిషన్ బేస్ మీద ఎగ్జిబిటర్లకు సినిమా ఇచ్చారని తెలిసింది.