డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలో కింగ్ నాగార్జున..హీరో ఎవరంటే?

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలో కింగ్ నాగార్జున..హీరో ఎవరంటే?

బంగార్రాజు మూవీతో ఫ్యాన్స్ ను అలరించిన హీరో నాగార్జున(Nagarjuna)  నుంచి మరో హిట్ పడలేదు. లేటెస్ట్ గా హీరో ధనుష్(Dhanush).. డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)  కాంబినేషన్  ఓ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామా మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీ లో మన్మథుడు నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు గల కథ చర్చలు మొదలైనట్టు సమాచారం. 

రీసెంట్ గా నాగార్జున నుంచి వచ్చిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో కూడా కీ రోల్ పోషించిన నాగ్.. మరోసారి ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తుండటంతో.. అక్కినేని ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారని తెలుస్తోంది.నాగ్ బంగార్రాజు మూవీ కాస్తా పర్వాలేదు అనిపించినా, వైల్డ్ డాగ్, ఘోస్ట్ మూవీస్ ఫ్యాన్స్ ను  పూర్తిగా నిరాశపరిచాయి. అటువంటి తమ అభిమాన హీరో నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కు.. ఇలా కీ రోల్ లో నటిస్తుండటంతో..ఇక ముందు కూడా అలాంటి పాత్రలే చేస్తాడా అనే చర్చ మొదలైంది.

ఆ మధ్య 'ధమాకా' రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ తో..గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా తో సినిమాలు చేస్తున్నట్లు వినిపించినా ఆ ప్రాజెక్ట్స్ ఇంత వరకు ప్రకటించలేదు నాగ్. దీంతో నాగ్ సెకండ్ ఇన్నింగ్స్ .. కీ రోల్ చేయడానికి కేటాయించాడా లేక.. కథ స్ట్రాంగ్ గా ఉండటంతో ఒకే చేశాడా అంటూ ఫ్యాన్స్ నుంచి మౌత్ టాక్ వినిపిస్తోంది. 

ALSO READ :తమన్నా స్టేట్ మెంట్ తో మైండ్ బ్లాంక్ : అది బాటిల్ ఓపెనరా.. డైమండ్ కాదా.. 

గతంలో కార్తీ తో ఊపిరి మూవీలో నటించి మంచి హిట్ కొట్టారు కింగ్ నాగార్జున. ఇక ధనుష్ ..శేఖర్ కమ్ముల మూవీ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ధనుష్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేయనున్నారు.