తమన్నా స్టేట్ మెంట్ తో మైండ్ బ్లాంక్ : అది బాటిల్ ఓపెనరా.. డైమండ్ కాదా..

తమన్నా స్టేట్ మెంట్ తో మైండ్ బ్లాంక్ :  అది బాటిల్ ఓపెనరా.. డైమండ్ కాదా..

హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. లేటెస్ట్ గా తమన్నా భారీ డైమండ్ రింగ్( Diamond Ring) తో కనిపించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోన్న విషయం తెలిసేందే. ఈ డైమండ్ రింగ్ ను రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. 

దీనిపై తమన్నా స్పందించారు.' ఈ విషయం చెప్పడానికి బాధపడుతున్నా..ఆ రోజు బాటిల్ ఓపెనర్ తో ఫోటో షూట్ చేశాం.. నేను నా చేతికి పెట్టుకున్నది నిజమైన వజ్రం కాదు' అని ఇన్స్టా స్టేటస్ ద్వారా షేర్ చేసుకున్నారు తమన్నా.  దీంతో అది నిజమైన డైమండ్ అని అందరు నమ్మగా.. ఇపుడు అసలు నిజం తెలియడంతో.. ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయిందని కామెంట్స్.. మరి కొందరైతే బకరాలను చేయటానికి ఇలాంటి స్టంట్స్ కూడా చేస్తున్నారా..అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

ALSO READ :డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలో కింగ్ నాగార్జున..హీరో ఎవరంటే?

కాగా ఈ వజ్రం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద వజ్రం అని..మెరిసే మెరుపు..అద్భుతమైన పరిమాణం కలిగి ఉన్న ఈ డైమండ్ అని.. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని టాక్ మోగిపోయింది. 2019 కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన సైరా నరసింహ రెడ్డి మూవీ లో తమన్నా నటించిన విషయం తెలిసిందే.. కాగా ఈ మూవీలో తమన్నా అద్భుతమైన నటనకు ముగ్ధులయిన ఉపాసన ఈ విలువైన గిఫ్ట్ ను ఇచ్చారని వార్తలు వచ్చాయి